TS TET | ‘టెట్’ ఫీజు మళ్లీ పెంపు.. ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వని రాయితీ
TS TET | టీఎస్ టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు ఫీజును మళ్లీ పెంచారు. గతంలో ఉన్న ఫీజుకు అదనంగా రూ. 100 పెంచడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2016లో టెట్‌ను నిర్వహించారు. అప్పుడు దరఖాస్తు ఫీజు కేవలం రూ. 200 మాత్రమే. 2017లో నిర్వహించిన టెట్‌కు కూడా అదే ఫీజు కొనసాగించారు. 2022లో నిర్వహించిన టెట్‌కు రూ. 300 వసూలు చేశారు. తాజాగా […]

TS TET | టీఎస్ టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు ఫీజును మళ్లీ పెంచారు. గతంలో ఉన్న ఫీజుకు అదనంగా రూ. 100 పెంచడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2016లో టెట్‌ను నిర్వహించారు. అప్పుడు దరఖాస్తు ఫీజు కేవలం రూ. 200 మాత్రమే. 2017లో నిర్వహించిన టెట్‌కు కూడా అదే ఫీజు కొనసాగించారు.
2022లో నిర్వహించిన టెట్‌కు రూ. 300 వసూలు చేశారు. తాజాగా విడుదలైన నోటిఫికేషన్‌కు మాత్రం దరఖాస్తు ఫీజును రూ. 400 చేశారు. దరఖాస్తు ఫీజును రూ. 400కు పెంచడంపై టెట్ అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఈడీ అభ్యర్థులు పేపర్-1, పేపర్-2 రాసుకోవచ్చు. ఈ రెండు పేపర్లకు కలిపి రూ. 400 చెల్లిస్తే సరిపోతుంది. కేవలం పేపర్-1 మాత్రమే రాసే డీఈడీ అభ్యర్థులు కూడా రూ. 400 చెల్లించాలని సంబంధిత వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. దీంతో ఒక పేపర్ రాసే తమ వద్ద రూ. 400 వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇక రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ఏ ప్రవేశ పరీక్షకైనా, ఉద్యోగ పోటీ పరీక్షలకైనా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుంలో కొంత తగ్గిస్తారు. కానీ టెట్‌కు మాత్రం ఎలాంటి రాయితీ ఇవ్వలేదు.