TSRTC – Arunachalam | అరుణాచల గిరి ప్రదక్షిణకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!

TSRTC - Arunachalam | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో ప్రతి పౌర్ణమికి జరిగే గిరిప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు నడుపనున్నట్లు ప్రకటించింది. ఇటీవల గురు పౌర్ణమి తొలిసారిగా సూపర్‌ లగ్జరీ బస్సులను నడిపించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దాంతో ప్రతి నెలా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రత్యేకంగా సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ […]

TSRTC – Arunachalam | అరుణాచల గిరి ప్రదక్షిణకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!

TSRTC – Arunachalam |

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో ప్రతి పౌర్ణమికి జరిగే గిరిప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు నడుపనున్నట్లు ప్రకటించింది. ఇటీవల గురు పౌర్ణమి తొలిసారిగా సూపర్‌ లగ్జరీ బస్సులను నడిపించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దాంతో ప్రతి నెలా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రత్యేకంగా సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజున జరుగుతుంది. ప్రదక్షిణం ప్రారంభానికి నాలుగు గంటల ముందే భక్తులకు అరుణాచలానికి చేర్చనున్నట్లు వెల్లడించారు. ప్రతి పౌర్ణమికి పది రోజుల ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వేషన్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఆయా బస్సు సర్వీసులు మొదట ఏపీలోని కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ దర్శనాలు పూర్తయ్యాక అరుణాచలం చేరుకుంటారు.

గిరి ప్రదక్షిణం పూర్తయ్యాక అదే రోజు సాయంత్రం వెల్లూరులోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శిస్తారు. అనంతరం తిరిగి ప్రయాణమవుతారు. గతంలో 32 సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో వెయ్యి మందికిపైగా భక్తులను సురక్షితంగా తీసుకువెళ్లి.. మళ్లి గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ పేర్కొంది.

ప్రత్యేక ప్యాకేజీ సర్వీసుకు మంచి స్పందన రావడంతో జిల్లాల కేంద్రాల నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది. అవసరమైతే ఏసీ బస్సులను సైతం నడిపేందుకు సిద్ధంగా సంస్థ తెలిపింది. అరుణాచలానికి వెళ్లాలనుకునే భక్తులు http://tsrtconline.in వెబ్‌సైట్‌లో పది రోజుల ముందుగా రిజర్వేషన్‌ చేసుకోవాలని కోరింది. వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని ఆర్టీసీ కోరింది.