TTD | ఈసారి బీసీలకు టీటీడీ చైర్మన్ పోస్ట్
TTD విధాత: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది. చైర్మన్ పదవికి కొత్త నాయకుడు ఎవరన్నది ఇంకా తెలియడం లేదు. కానీ ఈసారి మాత్రం జగన్ మనసులో బీసీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ఆగస్టు 12తో ముగియనుండగా ఇప్పటికే అయన రెండుసార్లు పదవిలో ఉన్నారు. ఇప్పుడు అయన ఉత్తరాంధ్రలో పార్టీ కోర్డినేటర్ గా చేస్తూనే ఇటు తిరుపతి దేవస్థానం బాధ్యతలు […]

TTD
విధాత: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది. చైర్మన్ పదవికి కొత్త నాయకుడు ఎవరన్నది ఇంకా తెలియడం లేదు. కానీ ఈసారి మాత్రం జగన్ మనసులో బీసీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ఆగస్టు 12తో ముగియనుండగా ఇప్పటికే అయన రెండుసార్లు పదవిలో ఉన్నారు.
ఇప్పుడు అయన ఉత్తరాంధ్రలో పార్టీ కోర్డినేటర్ గా చేస్తూనే ఇటు తిరుపతి దేవస్థానం బాధ్యతలు చూస్తున్నారు. ఇంకా ఆయనకు ఈసారి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశ్యం ఉందని అంటున్నారు. లేదా రాజ్యసభ పదవిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తవ్యక్తికి తిరుపతి దేవస్థానం బాధ్యత అప్పగించేలా జగన్ ఇప్పటికే కసరత్తు చేశారు . సుబ్బారెడ్డి రెండుసార్లు పదవిలో ఉన్నందున ఈసారి బిసిలకు పదవి ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దాంతోబాటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయన ఇప్పటికే వైసిపి అనుబంధసంఘాల అధ్యక్షుడిగా ఉన్నారు అంటే. యువజన, మహిళా, విద్యార్ధి, ఎస్సి, ఎస్టీ .. బీసీ, ట్రేడ్ యూనియన్, టీచర్లు, డాక్టర్స్, లాయర్లు ,, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి పలు విభాగాలకు అయన అధ్యక్షుడిగా ఉన్నారు. దానికితోడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అయన మరింత బిజీగా ఉంటారు.
అంతేకాకుండా ఇప్పుడున్న సుబ్బారెడ్డి స్థానంలో మళ్ళీ ఇంకో రెడ్డికి అవకాశం ఇవ్వడం బాగోదని, ఈసారి బీసీ ఐన జాంగా కృష్ణ మూర్తికి ఇవ్వాలని జగన్ ఆశిస్తున్నారు అంటున్నారు . యాదవ సామాజిక వర్గానికి చెందిన జాంగా కృష్ణమూర్తి 1999, 2004 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు గుంటూరు జిల్లా గురజాల నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జగన్ వెంట ఉన్నారు. ఇంతవరకూ ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు.
దీంతో ఇప్పుడు అయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తారని ఆశిస్తున్నారు. ఆయనకు పదవి ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా యాదవ వర్గం మద్దతు ఉంటుందని జగన్ కూడా లెక్క వేస్తున్నారని అంటున్నారు. ఏ లెక్కన చూసినా ఈసారి ఆ పదవి బీసీలకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.