TSPSC ప్రశ్నాపత్రాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌.. భార్య కోసం DAO పేపర్‌ కొనుగోలు చేసిన భర్త

పేపర్‌ కోసం ప్రవీణ్‌కు రూ. 6 లక్షలు ఇచ్చినట్టు సిట్‌ అధికారుల గుర్తింపు విధాత: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన 15 మంది నుంచి అనేక కీలక వివరాలు సేకరించిన సిట్‌ అధికారులు తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టు చేసింది. లౌకిక్‌, సుస్మిత అనే ఇద్దరి సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ నాంపల్లి కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇద్దరు నిందితులకు కోర్టు 14 […]

  • Publish Date - April 7, 2023 / 01:58 PM IST

పేపర్‌ కోసం ప్రవీణ్‌కు రూ. 6 లక్షలు ఇచ్చినట్టు సిట్‌ అధికారుల గుర్తింపు

విధాత: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన 15 మంది నుంచి అనేక కీలక వివరాలు సేకరించిన సిట్‌ అధికారులు తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టు చేసింది.

లౌకిక్‌, సుస్మిత అనే ఇద్దరి సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ నాంపల్లి కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇద్దరు నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.

భార్య సుస్మిత కోసం లౌకిక్‌ డీఏవో పేపర్‌ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌కు రూ. 6 లక్షలు ఇచ్చినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

Latest News