చిక్కుల్లో ఉద్ధవ్ ఠాక్రే..! ఆస్తులపై విచారణ జరిపించాలని బాంబే హైకోర్టులో పిటిషన్
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఆయన కుటుంబ సభ్యులు లెక్కల్లో చూపని ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలంటూ దాఖలపై పిటిషన్‌పై బాంబే హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఊహాగానాల ఆధారంగా వేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని థాకరే కుటుంబం కోర్టు కోరింది. దాదర్‌కు చెందిన గౌరీ భిడే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ముంబై పోలీసులకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని భిడే ఆరోపించారు. ఈ పిటిషన్‌పై […]

Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఆయన కుటుంబ సభ్యులు లెక్కల్లో చూపని ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలంటూ దాఖలపై పిటిషన్‌పై బాంబే హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఊహాగానాల ఆధారంగా వేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని థాకరే కుటుంబం కోర్టు కోరింది. దాదర్‌కు చెందిన గౌరీ భిడే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ముంబై పోలీసులకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని భిడే ఆరోపించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ధీరజ్ ఠాకూర్, జస్టిస్ వాల్మీకి ధర్మాసనం విచారణ జరిగింది. పిటిషనర్‌తో పాటు థాకరే కుటుంబం తరఫున వాదనలు విన్న కోర్టు పిటిషన్‌పై నిర్ణయాన్ని వాయిదా వేసింది.
అయితే ఈ కేసులో ముంబయి ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు ప్రారంభించిదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే, విచారణ ప్రారంభంపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పిటిషన్ తెలిపారు. పిటిషనర్ వాస్తవాల కంటే ఊహా జనితంగా ఆరోపణలు చేసినట్లు థాకరే తరఫు వ్యాయవాది చినోయ్ పేర్కొన్నారు. పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు. కరోనా సమయంలో థాకరే యాజమాన్యంలోని సామ్నా, మార్మిక్ వార్తా పత్రికల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారని, అయితే.. ఎప్పుడూ ఏ నిర్ధిష్ట సేవలు, వ్యాపారానికి ఆదాయానికి సంబంధించిన మూలాలను వెల్లడించలేదని పిటిషన్ ఆరోపించారు. అలాగే ముంబయి నగరంలో, రాయగఢ్ జిల్లాలో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని పిటిషన్ పేర్కొన్నారు. పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, ఉద్ధవ్ ఠాక్రే, రష్మీ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, తేజస్ ఠాక్రేలను ప్రతివాదులుగా చేయడంతో పాటు.. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐతో సమగ్ర దర్యాపునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.