Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లను అన్ ఫాలో చేయండి : వీసీ సజ్జనార్

బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలైతుంటే యూట్యూబ్ ఇన్‌ప్లూయెన్స‌ర్లకు కనీసం పశ్చాత్తాపం లేదు.. వీళ్లకు డబ్బే సర్వస్వం అంటూ టీజీఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ వీ.సీ. సజ్జనార్ ఫైర్ అయ్యారు.

Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లను అన్ ఫాలో చేయండి : వీసీ సజ్జనార్

Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయాలని టీజీఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ వీ.సీ. సజ్జనార్ పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలైతుంటే యూట్యూబ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌లో కనీసం పశ్చాత్తాపం వ్యక్తమవ్వకపోగా మేం చేయకపోతే ఇంకోకరు చేస్తారంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంపై మండిపడ్డారు.

ప్రజల ప్రాణాలకంటే వీళ్లకు డబ్బే సర్వస్వం అంటూ వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండని సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండని కోరారు. ఓ ఛానల్ లో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి తన ఇంటర్వ్యూలో తను బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారంటూ మాట్లడటాన్ని సజ్జనార్ తప్పుబట్టారు.

చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు చూడండి అంటూ ఎక్స్ లో సజ్జనార్ పోస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు.. వీళ్లకు డబ్బే సర్వస్వం అంటూ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే సజ్జనార్ సూర్యాపేట జిల్లాకు చెందిన యూట్యూబ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ సన్నీ యాదవ్ పై స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అటు ఏపీలో ఏపీలోనూ విశాఖకు చెందిన మరో ప్రముఖ యూ ట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ లోకల్ బాయ్ నానిని విశాఖపట్నం సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు.