Covid Vaccine | కొవిడ్‌ వ్యాక్సిన్లతో గుండెపోటు ప్రమాదం పెరిగిందా..? ఆరోగ్యమంత్రి మాండవీయ ఏమన్నారంటే..?

కరోనా మహమ్మారి ముప్పు నాలుగేళ్లుగా వెంటాడుతున్నది. కరోనా వైరస్‌ సోకిన వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వ్యక్తుల్లోనూ లాంగ్‌ కొవిడ్‌ కారణంగా ఆరోగ్య సమస్యలు ఆందోళన కొనసాగిస్తున్నాయి

Covid Vaccine | కొవిడ్‌ వ్యాక్సిన్లతో గుండెపోటు ప్రమాదం పెరిగిందా..? ఆరోగ్యమంత్రి మాండవీయ ఏమన్నారంటే..?

Covid Vaccine | కరోనా మహమ్మారి ముప్పు నాలుగేళ్లుగా వెంటాడుతున్నది. కరోనా వైరస్‌ సోకిన వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వ్యక్తుల్లోనూ లాంగ్‌ కొవిడ్‌ కారణంగా ఆరోగ్య సమస్యలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. మహమ్మారి తర్వాత అనేక అధ్యయనాలలో కొవిడ్ -19 బాధితులైన వ్యక్తులు గుండె జబ్బులతో పాటు పలు ఆరోగ్య సమస్యల బారినపడుతున్నట్లు తేలింది. కొవిడ్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వేసిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్లపై ఐసీఎంఆర్‌ వ్యాక్సిన్లపై కీలక విషయాలను వెల్లడించింది. వ్యాక్సిన్లతో గుండెజబ్బుల ముప్పు ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, వ్యాక్సిన్లతో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్న నివేదికలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తోసిపుచ్చారు.

ఐసీఎంఆర్‌ వివరణాత్మక అధ్యయనం..

గుండెపోటుకు కారణమయ్యే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో ఎలాంటి సంబంధం లేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) ఓ వివరణాత్మక అధ్యయనం చేసిందని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. వ్యాక్సిన్లు గుండెపోటుకు కారణం కాదని.. ఇలాంటివి నమ్మొద్దన్నారు. ఓ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గుండెపోటు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, మద్యపానం, ధూమపానం అలవాట్లు ఈ ప్రమాదానికి కారణమవుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్‌లపై అపోహలు వస్తున్నాయని ఆరోగ్య మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎవరికైనా స్ట్రోక్‌ వస్తే కోవిడ్-19 వ్యాక్సిన్‌తో వచ్చిందని కొందరు అనుకుంటారని.. దీనిపై ఐసీఎంఆర్‌ ఓ వివరణాత్మక అధ్యయనం నిర్వహించిందని.. టీకా గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూడలేదని గుర్తించిందని పేర్కొన్నారు.

గుండెపోటుకు కారణాలు

గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయని, వాటిలో అనారోగ్యకరమైన జీవనశైలి, మితిమీరిన పొగాకు, అధిక మద్యపానమని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. చాలా సార్లు, తప్పుడు సమాచారం ప్రజల్లో వ్యాపిస్తుందన్నారు. దాని శాస్త్రీయ రుజువులు, సాక్ష్యాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. గత ఏడాది నవంబ‌ర్‌లో ప్రచురించబడిన పీర్-రివ్యూడ్ ఐసీఎంఆర్‌ అధ్యయనం వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తుల్లో గుండెపోటు ప్రమాదం లేదని గుర్తించింది. దేశంలోని 47 కంటే ఎక్కువ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ప్రభావాలను తెలుసుకోవడానికి అధ్యయనాలు జరిగాయి. అక్టోబర్ 2021-మార్చి 2023 మధ్య వివరించలేని కారణాల వల్ల అకస్మాత్తుగా మరణించిన 18-45 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన వ్యక్తుల డేటాను అధ్యయనం చేసింది. చాలా సందర్భాలలో ఆకస్మిక మరణం, ధూమపానం, మాదకద్రవ్యాల వాడకం, ఆల్కహాల్, అధిక ధూమపానం మరణానికి రెండు రోజుల ముందు అధిక తీవ్రత శారీరక శ్రమ, కుటుంబ చరిత్ర ప్రధాన కారణాలుగా గుర్తించారు. తరచూ మద్యం సేవించే వారిలో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు కేసులు

కరోనా మహమ్మారి తర్వాత భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు గణనీయంగా పెరగడం గమనార్హం. కోవిడ్ -19 వ్యాక్సిన్ కారణంగా ఇంత ప్రమాదం ఉండవచ్చని కొన్ని నివేదికలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా 60 ఏళ్ల వయసులో ఉన్నారని, మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్‌లు సురక్షితమైనవని.. ఇన్‌ఫెక్షన్ విషయంలో తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నుంచి రక్షించడంలో సహాయపడతాయన్నారు.