ఎఫ్‌డీల‌పై 9.5 శాతం వ‌డ్డీరేటు

విధాత: ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అత్య‌ధికంగా 9.5 శాతం వ‌డ్డీరేటును ఇస్తామ‌ని యునిటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్ర‌క‌టించింది. 1001 రోజుల ఎఫ్‌డీపై బ్యాంక్ ఈ ఆఫ‌ర్ చేస్తున్న‌ది. ఇత‌రుల‌కు మాత్రం 9 శాతం వార్షిక వ‌డ్డీరేటును ఇస్తామ‌ని చెప్తున్న‌ది. ఇక 181-201 రోజులు, 501 రోజుల కాల‌వ్య‌వ‌ధి ఎఫ్‌డీల‌పై 8.75 శాతం వ‌డ్డీరేటును ఈ బ్యాంక్ ఇస్తున్న‌ది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్రం 9.25 శాతం వ‌డ్డీరేటు వ‌ర్తిస్తుంది. కాగా, నిర్ణీత వ్య‌వ‌ధి కంటే […]

ఎఫ్‌డీల‌పై 9.5 శాతం వ‌డ్డీరేటు

విధాత: ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అత్య‌ధికంగా 9.5 శాతం వ‌డ్డీరేటును ఇస్తామ‌ని యునిటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్ర‌క‌టించింది. 1001 రోజుల ఎఫ్‌డీపై బ్యాంక్ ఈ ఆఫ‌ర్ చేస్తున్న‌ది. ఇత‌రుల‌కు మాత్రం 9 శాతం వార్షిక వ‌డ్డీరేటును ఇస్తామ‌ని చెప్తున్న‌ది.

ఇక 181-201 రోజులు, 501 రోజుల కాల‌వ్య‌వ‌ధి ఎఫ్‌డీల‌పై 8.75 శాతం వ‌డ్డీరేటును ఈ బ్యాంక్ ఇస్తున్న‌ది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్రం 9.25 శాతం వ‌డ్డీరేటు వ‌ర్తిస్తుంది. కాగా, నిర్ణీత వ్య‌వ‌ధి కంటే ముందే ఎఫ్‌డీని విత్‌డ్రా చేసుకుంటే వ‌డ్డీరేటులో 1 శాతం మైన‌స్ అవుతుంద‌ని బ్యాంక్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్న‌ది.

సేవింగ్స్ ఖాతాల్లో ల‌క్ష రూపాయ‌ల‌దాకా ఉంటే 6 శాతం వ‌డ్డీరేటు, ఆపై న‌గదు ఉంచితే 7 శాతం వ‌డ్డీరేటు అందుకోవ‌చ్చ‌ని యునిటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఇక నిరుడు మే నుంచి రిజ‌ర్వ్ బ్యాంక్ రెపోరేటు పెరుగుతున్న నేప‌థ్యంలో అటు రుణాల‌పై.. ఇటు ఎఫ్‌డీల‌పైనా వ‌డ్డీరేట్లు పెరుగుతూపోతున్నాయి.