యూపీలో నేడు నాన్ వెజ్ డే

సాధు తన్వార్దాస్ లీలారామ్ వాస్వానీ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ‘నో నాన్ వెజ్ డే’గా ప్రకటించింది.

యూపీలో నేడు నాన్ వెజ్ డే
  • ప్ర‌క‌టించిన యోగి ప్ర‌భుత్వం
  • అన్ని మాంసం దుకాణాలు మూత‌


విధాత‌: సాధు తన్వార్దాస్ లీలారామ్ వాస్వానీ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ‘నో నాన్ వెజ్ డే’గా ప్రకటించింది. శాకాహార జీవనశైలి కోసం వాదించిన వాస్వానీ జయంతి సందర్భంగా శనివారం అన్ని కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని యూపీ స‌ర్కారు శుక్ర‌వారం జారీచేసిన ఉత్త‌ర్వులో ఆదేశించింది.


“అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మన దేశ మహనీయుల జయంతిని ‘అహింసా’ దినాలుగా జరుపుకుంటున్నాం. యూపీలో మహావీర్ జయంతి, బుద్ధ జయంతి, గాంధీ జయంతి, సాధు టిఎల్ వాస్వానీ జయంతి జరుపుకుంటున్నందున, యూపీ ప్రభుత్వం రాష్ట్రంలో కబేళాలను మూసివేయడానికి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న‌ది” అని ప్రభుత్వ నోటిఫికేషన్‌లో తెలిపింది.