Rajinikanth | యోగి కాళ్లు మొక్కిన ర‌జనీకాంత్‌.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉన్న హీరో. ఆయ‌న సినిమాలంటే అభిమానుల‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది. ర‌జ‌నీకాంత్ సినిమా కోసం ఆయ‌న ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంటారు. గ‌త మూడేళ్లుగా ర‌జ‌నీకాంత్‌కి స‌రైన స‌క్సెస్ లేదు. ఇలాంటి స‌మ‌యంలో జైల‌ర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారు […]

  • By: sn    latest    Aug 20, 2023 9:35 AM IST
Rajinikanth | యోగి కాళ్లు మొక్కిన ర‌జనీకాంత్‌.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

Rajinikanth |

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉన్న హీరో. ఆయ‌న సినిమాలంటే అభిమానుల‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది. ర‌జ‌నీకాంత్ సినిమా కోసం ఆయ‌న ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంటారు. గ‌త మూడేళ్లుగా ర‌జ‌నీకాంత్‌కి స‌రైన స‌క్సెస్ లేదు. ఇలాంటి స‌మ‌యంలో జైల‌ర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారు రెండు వందల కోట్ల కలెక్షన్లు రాబ‌ట్ట‌డం విశేషం. జైలర్ సినిమా హిట్‌తో ఇప్పుడు సూప‌ర్ స్టార్ పేరు దేశ విదేశాల‌లో మారు మ్రోగిపోతుంది. సినిమాకి అతీతంగా అభిమానుల‌ని సంపాదించుకొని , భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న రజనీకాంత్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు.

ర‌జ‌నీకాంత్ రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన అధికార నివాసంలో కలిసి యోగి పాదాలకు నమస్కరించారు. ఇది కొంద‌రు ర‌జ‌నీ అభిమానుల‌తో పాటు త‌మిళుల‌కి ఏ మాత్రం న‌చ్చ‌లేదు. తమ ఆత్మగౌరవాన్ని సీఎం యోగి కాళ్ల వద్ద ర‌జ‌నీకాంత్ తాకట్టుపెట్టారని అభిమానులు, తమిళ ప్రజలు తీవ్ర‌మైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇది ర‌జ‌నీ నుంచి ఊహించ‌ని హేయ‌మైన చ‌ర్య అని అంటున్నారు. 72ఏళ్ల రజనీకాంత్‌.. 51ఏళ్ల యోగి కాళ్లకి నమస్కారం చేయడం ఎంత వ‌ర‌కు కరెక్ట్ అంటూ కొంద‌రు ర‌జ‌నీకాంత్ చర్య‌ని త‌ప్పుప‌డుతున్నారు.. ర‌జ‌నీకాంత్ చేసిన చ‌ర్య చాలా అవమానమైన విషయమని తమిళ ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు. అయితే యోగి ఒక సన్యాసి అని, రజనీ అలా చేయడంలో విమ‌ర్శించాల్సిన అవ‌స‌రం లేద‌ని కొంద‌రు ర‌జ‌నీకాంత్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

హిమాల‌యాల నుంచి వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ ఆథ్యాత్మిక కోణంలో అలా చేశారని, దాన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం లేద‌ని కొంద‌రు సూచిస్తున్నారు. ఏదేమైన ఇప్పుడు ర‌జ‌నీకాంత్ చేసిన ప‌ని అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక రజనీకాంత్ న‌టించిన ‘జైలర్‌’ చిత్రం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొంద‌గా, ఈ చిత్రాన్ని స‌న్‌ పిక్చర్స్ నిర్మించారు. ఆగస్ట్ 10న ఈ సినిమా విడుదలైన ఈ చిత్రం . భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. రజనీ మాస్‌ యాక్షన్‌, అనిరుథ్‌ రవిచందర్‌ బీజీఎం, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ గెస్ట్ అప్పీయరెన్స్, దర్శకుడు దిలీప్‌ టేకింగ్ సినిమా ఇంత పెద్ద విజ‌యం సాధించ‌డంలో భాగం అయ్యాయి.