ఈ వర్షాలు.. కరోనా వైరస్ కంటే ఘోరంగా ఉన్నాయి: UP రైతులు
విధాత: గత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పొలాలు నీట మునిగి చేతికొచ్చిన పంట కూడా వర్షం పాలవుతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యూపీ రైతులు ఈ వర్షాలను కరోనా వైరస్‌తో పోల్చారు. కరోనా కంటే ఈ వర్షాలే ప్రమాదంగా మారాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో గడిచిన వారం రోజుల్లో 67 శాతం […]

విధాత: గత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పొలాలు నీట మునిగి చేతికొచ్చిన పంట కూడా వర్షం పాలవుతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యూపీ రైతులు ఈ వర్షాలను కరోనా వైరస్‌తో పోల్చారు. కరోనా కంటే ఈ వర్షాలే ప్రమాదంగా మారాయని పేర్కొంటున్నారు.
ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో గడిచిన వారం రోజుల్లో 67 శాతం వర్షపాతం అధికంగా నమోదైందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వేల ఎకరాల్లో వర్షం నీరు భారీగా చేరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని పంటలను సాగు చేస్తే.. ఈ వర్షాలు తమకు తీవ్ర నష్టాన్ని మిగిలుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి, గోధుమ, మొక్కజొన్న, బంగాళాదుంప, బజ్రా, చిరు ధాన్యాల వంటి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. పంట నష్టం కలిగిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.