Unseasonal Rains | అకాల వర్షాలతో రైతన్న ఆగమాగం.. కల్లాల్లోని ధాన్యపు రాశులు వర్షంపాలు
ఇటీవల ములుగు జిల్లాలో కండ్ల ముందే రైతులు పండించిన ధాన్యం వరదలో కొట్టుకుపో్యింది. దీంతో అన్నదాతలు కన్నీటిపర్యంతమయ్యారు. ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను సమీపంలోని ఊరవాగు ఉప్పోంగి కొనుగోలు కేంద్రాన్ని ముంచెత్తింది. దీంతో 45 మంది రైతులు ఆరబోసుకున్న సుమారు 200 ఏకరాల ధాన్యం వాగు వరద ఉదృతితో కొట్టుకుపోయింది.

Unseasonal Rains | ఓ వైపు అకాలవర్షాలు.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి రైతన్న అష్టకష్టాలు పడుతున్నాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం ఎటూ కదలడం లేదు. తేమ కారణంగా కొన్ని చోట్ల అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదు.. హమాలీల కొరత.. బస్తాల కొరత సైతం వేధిస్తున్నది. దీంతో అకాల వర్షాలతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట తమ కండ్ల ముందే వర్షం పాలవుతున్నది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. ధాన్యం కొనుగోలు విషయంలో శ్రద్ధ చూపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
కండ్లముందే వరదలో కొట్టుకుపోయిన ధాన్యం
ఇటీవల ములుగు జిల్లాలో కండ్ల ముందే రైతులు పండించిన ధాన్యం వరదలో కొట్టుకుపో్యింది. దీంతో అన్నదాతలు కన్నీటిపర్యంతమయ్యారు. ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను సమీపంలోని ఊరవాగు ఉప్పోంగి కొనుగోలు కేంద్రాన్ని ముంచెత్తింది. దీంతో 45 మంది రైతులు ఆరబోసుకున్న సుమారు 200 ఏకరాల ధాన్యం వాగు వరద ఉదృతితో కొట్టుకుపోయింది. ఖాంటాలు పెట్టిన సుమారు 150 బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. అంతే కాకుండా లోడింగ్ కు సిద్దంగా ఉన్న ధాన్యం బస్తాలు మిల్లర్లు క్వింటాకు 10 కీలోలు తరుగు తీయాలనడంతో కొనుగోలు కేంద్రంలోనే ఉంచామని వరద తాకిడికి ఆ బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయని రైతులు వాపోతున్నారు. సకాలంలో కాంటాలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి రైతులు వాపోతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే నాశనం కావడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్వింటాకు 200 నష్టం
మరోవైపు రైతులకు ధరల కష్టాలు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. క్వింటాలుకు 200 రూపాయల చొప్పున నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మిల్లర్లు బస్తాకు 42 కిలోలే తూకం వేస్తున్నారని.. తేమ పేరుతో అదనంగా మరో కిలో కోత పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టార్పాలిన్లు, గన్నీ సంచు లు అందుబాటులో లేవు. తరుగు పేరుతో బస్తాకు నాలుగు కిలోల ధాన్యం తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.