Viral News | దశాబ్దాల కల నెరవేరింది.. వృద్ధురాలి ఇంట్లో వెలుగులు నింపిన IPS
Viral News | ఓ వృద్ధురాలి దశాబ్దాల కల నెరవేరింది. ఏండ్లకు ఏండ్లు చీకటిలో మగ్గుతున్న ఆ వృద్ధురాలి ఇంట్లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ వెలుగులు నింపారు. ఆ ఇంట్లో కరెంట్ బల్బ్ వెలగగానే.. వృద్ధురాలి ముఖంలో వెయ్యి వోల్టేజీల సంతోషం కనిపించింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షార్ జిల్లాలో ఓ వృద్ధురాలి(70) ఇంటికి కరెంట్ సరఫరా లేదు. దీంతో ఆమె గత కొన్నేండ్ల నుంచి చీకటిలోనే ఉంటుంది. ప్రజలకు, పోలీసులకు మరింత స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు […]

Viral News | ఓ వృద్ధురాలి దశాబ్దాల కల నెరవేరింది. ఏండ్లకు ఏండ్లు చీకటిలో మగ్గుతున్న ఆ వృద్ధురాలి ఇంట్లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ వెలుగులు నింపారు. ఆ ఇంట్లో కరెంట్ బల్బ్ వెలగగానే.. వృద్ధురాలి ముఖంలో వెయ్యి వోల్టేజీల సంతోషం కనిపించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షార్ జిల్లాలో ఓ వృద్ధురాలి(70) ఇంటికి కరెంట్ సరఫరా లేదు. దీంతో ఆమె గత కొన్నేండ్ల నుంచి చీకటిలోనే ఉంటుంది. ప్రజలకు, పోలీసులకు మరింత స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు బులంద్‌షార్ పోలీసులు పోలీసు చౌపాల్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా నూర్జహాన్ అనే వృద్ధురాలు తన ఇంటికి విద్యుత్ సరఫరా కల్పించాలని కోరారు. దీంతో పోలీసు నిధుల నుంచి ఆ వృద్ధురాలికి ఇంటికి విద్యుత్ సరఫరా కల్పించారు. ఓ ఫ్యాన్‌ను కూడా బహుమతిగా అందించారు.
అయితే 2020 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అనుకృతి శర్మ.. బులంద్‌షార్ అడిషనల్ ఎస్‌పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఇటీవలే నూర్జహాన్ ఇంటికి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్.. ఆమె ఇంట్లో విద్యుత్ బల్బ్ వెలిగించారు. విద్యుత్ బల్బ్ వెలిగిన సమయంలో.. నూర్జహాన్ ముఖంలో వెయ్యి వోల్టేజీల సంతోషం కనిపించింది. ఐపీఎస్ ఆఫీసర్ కూడా చిరునవ్వు చిందించారు. ఈ దృశ్యాలను ఐపీఎస్ ఆఫీసర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.
Swades moment of my life