UPSC | దేశంలో 1376 IAS, 703 IPS పోస్టులు ఖాళీ

UPSC విధాత‌: దేశంలో 1376 ఐఎఎస్ పోస్టులు, 703 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేంద్ర‌సింగ్ గురువారంనాడు రాజ్య‌స‌భ‌కు తెలియ‌జేశారు. వీటితోపాటు ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీసు (ఐఎఫ్ఎస్‌)లో 1042 పోస్టులు, ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీసు(ఐఆరెస్‌)లో 301 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని జితేంద్ర‌సింగ్ ఒక లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలియ‌జేశారు. ఖాళీలు ఏర్ప‌డ‌డం, భ‌ర్తీ చేయ‌డం ఒక నిరంత‌ర ప్ర‌క్రియ అని, ఖాళీల‌ను త్వ‌రితగ‌తిన భ‌ర్తీ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని మంత్రి […]

  • By: Somu    latest    Aug 03, 2023 11:52 AM IST
UPSC | దేశంలో 1376 IAS, 703 IPS పోస్టులు ఖాళీ

UPSC

విధాత‌: దేశంలో 1376 ఐఎఎస్ పోస్టులు, 703 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేంద్ర‌సింగ్ గురువారంనాడు రాజ్య‌స‌భ‌కు తెలియ‌జేశారు. వీటితోపాటు ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీసు (ఐఎఫ్ఎస్‌)లో 1042 పోస్టులు, ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీసు(ఐఆరెస్‌)లో 301 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని జితేంద్ర‌సింగ్ ఒక లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలియ‌జేశారు.

ఖాళీలు ఏర్ప‌డ‌డం, భ‌ర్తీ చేయ‌డం ఒక నిరంత‌ర ప్ర‌క్రియ అని, ఖాళీల‌ను త్వ‌రితగ‌తిన భ‌ర్తీ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని మంత్రి తెలిపారు. ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డానికి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ సివిల్ స‌ర్వీసు ఎగ్జామినేష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హిస్తున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు.

ఐఎఎస్‌లోకి తీసుకునే వారి సంఖ్య‌ను సీఎస్ఈ-2022 నుంచి 180కి పెంచామ‌ని, ఐపీఎస్‌లోకి తీసుకునేవారి సంఖ్య‌ను సీఎస్ఈ2020 నుంచి 200కు పెంచామ‌ని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఐఆరెస్‌లోకి తీసుకునేవారి సంఖ్య‌ను సీఎస్ఈ 2023 నుంచి 301కి, ఐఎఫ్ఎస్‌లోకి తీసుకునేవారి సంఖ్య‌ను సీఎస్ఈ 2022 నుంచి 150కి పెంచిన‌ట్టు కేంద్ర‌మంత్రి చెప్పారు.