Urvashi Rautela | బాలీవుడ్ బ్యూటీని అఖిల్ వేధించాడా..? ఉమైర్ సంధు వ్యాఖ్యలపై ఊర్వశి రౌటెలా ఫైర్!
Urvashi Rautela | సినిమా పరిశ్రమలో నటీనటుల మధ్య గాసిప్స్ సర్వసాధారణమే. కానీ, కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తూ తమ పాపులారిటీని సంపాదిస్తుంటారు. అలాంటి వారులో ఉమైర్ సంధు ముందువరుసలో ఉంటాడు. ఎప్పుడు హీరో హీరోయిన్ల మధ్య అక్రమ సంబంధాలు అంటగడుతూ.. అక్రమ సంబంధాలు అంటగడుతూ ఉంటాడు. బాలీవుడ్ క్రిటిక్‌గా చెప్పుకుంటాడు. ట్విట్టర్‌లో నోటికి ఏది వస్తే రాసుకుంటూ.. సెలబ్రిటీలనే కాకుండా అభిమానులను సైతం విమర్శిస్తుంటాడు. ఇటీవల కేజీఎఫ్ స్టార్ యష్.. హీరోయిన్ శ్రీనిధిని వేధించాడంటూ ఆరోపించారు. […]

Urvashi Rautela |
సినిమా పరిశ్రమలో నటీనటుల మధ్య గాసిప్స్ సర్వసాధారణమే. కానీ, కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తూ తమ పాపులారిటీని సంపాదిస్తుంటారు. అలాంటి వారులో ఉమైర్ సంధు ముందువరుసలో ఉంటాడు. ఎప్పుడు హీరో హీరోయిన్ల మధ్య అక్రమ సంబంధాలు అంటగడుతూ.. అక్రమ సంబంధాలు అంటగడుతూ ఉంటాడు. బాలీవుడ్ క్రిటిక్‌గా చెప్పుకుంటాడు. ట్విట్టర్‌లో నోటికి ఏది వస్తే రాసుకుంటూ.. సెలబ్రిటీలనే కాకుండా అభిమానులను సైతం విమర్శిస్తుంటాడు.
ఇటీవల కేజీఎఫ్ స్టార్ యష్.. హీరోయిన్ శ్రీనిధిని వేధించాడంటూ ఆరోపించారు. ఆ తర్వాత సెలీనా జైట్లీపై సంచలన విమర్శలు చేశాడు. అలాగే, అల్లు అర్జున్, రష్మిక రిలేషన్‌లో ఉన్నారంటూ కామెంట్ చేయగా నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్‌పై బురద జల్లేందుకు ప్రయత్నించాడు.
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన విషయం తెలిసిందే. ‘ఏజెంట్ సినిమా సెట్‌లో అఖిల్ ఊర్వశిని వేధింపులకు గురి చేశాడని, అతనితో ఊర్వశి కంఫర్టబుల్‌గా ఫీల్ కాలేదంటూ ఇద్దరి ఫొటోలను ట్వీట్ చేశాడు. ఉమైర్ సంధు చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయితే, దీనిపై ఊర్వశి రౌటెలా స్పందించింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉమైర్ సంధూకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తన లీగల్ నోటీసులు పంపిస్తున్నానని, నువ్వేం నా స్పోక్ పర్సన్ వి కాదు నా గురించి మాట్లాడటానికి అంటూ మండిపడింది.
నువ్వే మెచ్యూరిటీ లేని ఓ జర్నలిస్ట్ అని, నేను, నా ఫ్యామిలీ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా నువ్వు చేస్తున్నావు అంటూ మండిపడింది. ఉమైర్ సంధూపై అఖిల్, ఊర్వశి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఊర్వశి రౌటెలాపై ఉమైర్ సంధూ దిగజారుడు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.