Daaku Maharaaj: OTT స్ట్రీమింగ్‌కు వచ్చేసిన.. డాకు మహారాజ్! ఇక దబిడి దిబిడే

Daaku Maharaaj:
విధాత: ఇటీవల సంక్రాంతికి భారీ సినిమాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన బాలకృష్ణ (Nandamuri Balakrishna) డాకు మహారాజ్ (Daaku Maharaaj) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బాలయ్య వరుసగా రూ100కోట్ల క్లబ్‌లో చేర్చిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ నిర్మించగా బాబీ దర్శకత్వం, తమన్ సంగీతం అందించారు. ప్రజ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాధ్ (Shraddha Srinath), ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) కథానాయికలుగా, బాబీ డియోల్ (Bobby Deol) ప్రతి నాయకుడిగా నటించారు.
కథ విషయానికి వస్తే.. మదనపల్లిలో ఓ కాఫీ ఎస్టేట్ అధిపతి అయిన కృష్ణమూర్తి లోకల్‌గా విద్యాసంస్థను నడిపిస్తూ తన మనుమరాలు (వైష్ణవి)ని అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. స్థానిక ఎమ్మెల్యేతో ఆ ఫ్యామిలీకి ముప్పు ఏర్పడుతుంది. ఈ విషయం కాస్త డాకూ మహారాజ్‌కు తెలిసి నానాజీ ఆ ఇంట్లో కారు డ్రైవర్‌గా చేరి పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు.
అదే సమయంలో ఓ వైపు బల్వంత్ ఠాకూర్‌కు సంబంధించిన ఓ క్రూరమైన గ్యాంగ్ ఆ కుటుంబాన్ని అంతమొందించడానికి, ఓ పోలీసుల టీం నానాజీ కోసం రంగంలోకి దిగుతాయి. చివరకు నానాజీ వారి నుంచి ఆ ప్యామిలీని, కాపాడాడా వైష్ణవికి నానాజీ ఉన్న సంబంధం ఏంటీ, ఇంతకు మహారాజ్ ఎవరు?భోపాల్‌లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్), నందిని (శ్రద్ధా శ్రీనాథ్)లకు సంబంధం ఏంటనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. #DaakuMaharaajOnNetflix
ఇదిలాఉండగా.. ఈ సినిమా కథ కొత్తదేమీ కాకపోయినా దర్శకుని ప్రతిభ, స్లోరీ నెరేషన్ చూసే వారిని విపరీతంగా ఆకట్టుకుంటాయి. విజువల్స్ కూడా మెస్మరైజ్ చేస్తాయి. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ సినీ లవర్స్‌ను సీట్‌లో కూర్చొనివ్వని యాక్షన్ అంశాలతో రక్తి కట్టిస్తారు. ఇప్పుడీ సినిమా ఈ రోజు శుక్రవారం, ఫిబ్రవరి 21 తెల్లవారుజాము నుంచే నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవుతోంది. సో.. ఇప్పటికే ఎవరతే థియేటర్లలో మిస్సయ్యారో, మరోసారి ఈ మూవీ చూడాలనుకునే వారుఇప్పుడు మిస్ అవకుండా ఈ డాకు మహారాజ్ (Daaku Maharaaj) సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.