Uttar Pradesh | యూపీలో ఎస్సై కాల్చివేత‌

Uttar Pradesh బైక్‌పై వ‌చ్చి అగంత‌కుల దుశ్చ‌ర్య‌ క‌ట్నం కేసు ద‌ర్యాప్తు చేసి వ‌స్తుండ‌గా దారుణం విధాత‌: యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో ఓ పోలీస్‌ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను దుండ‌గులు కాల్చి చంపారు. ఓ క‌ట్నం కేసును ద‌ర్యాప్తు చేసి వ‌స్తుండ‌గా, బైక్‌పై వ‌చ్చిన‌ గుర్తు తెలియ‌ని ముష్క‌రులు ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఆగ్రాకు చెందిన దినేశ్‌కుమార్ మిశ్రా (54) ఆరోన్ పోలీస్‌స్టేష‌న్ ఎస్సైగా ప‌నిచేస్తున్నారు. #WATCH | Uttar Pradesh: A sub-inspector […]

  • By: Somu    latest    Aug 04, 2023 12:46 AM IST
Uttar Pradesh | యూపీలో ఎస్సై కాల్చివేత‌

Uttar Pradesh

  • బైక్‌పై వ‌చ్చి అగంత‌కుల దుశ్చ‌ర్య‌
  • క‌ట్నం కేసు ద‌ర్యాప్తు చేసి వ‌స్తుండ‌గా దారుణం

విధాత‌: యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో ఓ పోలీస్‌ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను దుండ‌గులు కాల్చి చంపారు. ఓ క‌ట్నం కేసును ద‌ర్యాప్తు చేసి వ‌స్తుండ‌గా, బైక్‌పై వ‌చ్చిన‌ గుర్తు తెలియ‌ని ముష్క‌రులు ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఆగ్రాకు చెందిన దినేశ్‌కుమార్ మిశ్రా (54) ఆరోన్ పోలీస్‌స్టేష‌న్ ఎస్సైగా ప‌నిచేస్తున్నారు.

గురువారం సాయంత్రంలో ఓ క‌ట్నం కేసు ద‌ర్యాప్తు కోసం చాంద్‌పూర్ అనే గ్రామానికి వెళ్లి వ‌స్తుండ‌గా, బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు దుండ‌గులు అతి స‌మీపం నుంచి ఎస్సైని కాల్చారు. తీవ్రంగా గాయ‌ప‌డిన దినేశ్‌కు ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా, చికిత్స అందిస్తుండ‌గానే తుదిశ్వాస విడిచారు. పోలీసులు కేసు దర్యాప్తు చేప‌ట్టారు. నిందితులను పట్టుకునేందుకు పలు ప్ర‌త్యేక బృందాలను ఏర్పాటు చేశారు.