Beer Bottles | ఏపీలో బీర్ల వ్యాన్ బోల్తా.. ఎగబడ్డ జనాలు
అనకాపల్లి జిల్లాలో వ్యాన్ ఫల్టీ రోడ్డు పాలైన 200 కేసుల బీర్లు ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు డ్రైవర్‌ను పట్టించుకొనే వారే లేరు విధాత: ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు అడిగిన చందంగా.. ప్రమాదవశాత్తు ఓ బీర్ల లోటు (Beer Bottles) వ్యాన్ బోల్తా పడితే అయ్యో పాపం.. అని జాలి చూపి డ్రైవర్‌ను రక్షించాల్సింది పోయి.. అందిన కాడికి బీర్లను ఎత్తుకెళ్లిపోయారు స్థానికులు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. తండోపతండాలుగా […]
- అనకాపల్లి జిల్లాలో వ్యాన్ ఫల్టీ
- రోడ్డు పాలైన 200 కేసుల బీర్లు
- ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు
- డ్రైవర్‌ను పట్టించుకొనే వారే లేరు
విధాత: ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు అడిగిన చందంగా.. ప్రమాదవశాత్తు ఓ బీర్ల లోటు (Beer Bottles) వ్యాన్ బోల్తా పడితే అయ్యో పాపం.. అని జాలి చూపి డ్రైవర్‌ను రక్షించాల్సింది పోయి.. అందిన కాడికి బీర్లను ఎత్తుకెళ్లిపోయారు స్థానికులు.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. తండోపతండాలుగా తరలివచచ్చిన ప్రజలు.. అందినకాడికి బీర్లను ఎత్తుకుపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళుతున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. అనకాపల్లి మద్యం డిపో నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 200 కేసుల బీరు సీసాలు రోడ్డు పాలయ్యాయి.
కొన్ని కాటన్ల బీరు సీసాలు పగిలిపోగా, మరికొన్ని పగలకుండా ఉన్నాయి. జాతీయ రహదారిపై ప్రమాదం జరగటంతో స్థానికులతో పాటు అటుగా వెళ్తున్న వాహనదారుల దృష్టి.. రోడ్డుపై పడిన బీరుబాటిళ్లపై పడింది. ఇంకేముంది రెచ్చిపోయారు. హుటాహుటీన అక్కడికి చేరుకుని అందిన కాడికి బీరు సీసాలు సంకలో పెట్టుకొని వెళ్లిపోయారు.
వ్యాన్ బోల్తా పడటంతో ఆ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. టాటాఏస్ వాహనాన్ని అక్కడి నుంచి తొలగించి.. రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram