Mexico | పీకల దాకా మద్యం సేవించి.. పెట్రోల్ బాంబుతో బార్‌పై దాడి! 11 మంది మృతి
Mexico | ఓ తాగుబోతు చేసిన పనికి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పీకల దాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి.. బార్‌పె పెట్రోల్ బాంబుతో దాడి చేయడంతో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోలోని సోనోనా రాష్ట్రంలోని శాన్ లూయిస్ రియో కొలరాడో నగరంలో ఉన్న బార్‌కు ఓ వ్యక్తి వెళ్లి పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత బార్‌లో ఉన్న మహిళలతో సదరు వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో బార్ సిబ్బంది అతన్ని […]

Mexico |
ఓ తాగుబోతు చేసిన పనికి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పీకల దాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి.. బార్‌పె పెట్రోల్ బాంబుతో దాడి చేయడంతో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోలోని సోనోనా రాష్ట్రంలోని శాన్ లూయిస్ రియో కొలరాడో నగరంలో ఉన్న బార్‌కు ఓ వ్యక్తి వెళ్లి పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత బార్‌లో ఉన్న మహిళలతో సదరు వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో బార్ సిబ్బంది అతన్ని బయటకు పంపించారు.
తనను బయటకు పంపించడంతో ఆగ్రహానికి లోనైన మందుబాబు బార్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అటు నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటికే అతను బార్‌పై పెట్రోల్ బాంబుతో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో బార్‌లో మంటలు చెలరేగి, అంతటా వ్యాపించాయి. బయటకు వెళ్లేందుకు ఒక్కటే దారి ఉండటంతో.. చాలా మంది లోపలే చిక్కుకుపోయారు.
Difunden el video de cómo comenzó el incendio en el bar “Beer House Cantina” de San Luis Río Colorado, Sonora pic.twitter.com/EE5NuSDL3Q
— Carlos Guzmán Martín (@asiesguzmanm) July 23, 2023
అగ్నికీలలు ఎగిసిపడటంతో 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.