Viral Video | స్కూల్లోనే సిగపట్లు పట్టుకున్న హెడ్‌మాస్టర్, టీచర్
Viral Video | ఓ స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్ మధ్య చోటు చేసుకున్న గొడవ దాడులు చేసుకునే దాకా వచ్చింది. టీచర్‌ను చెప్పుతో కొట్టి.. కిందపడేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలోని కౌరియా పంచాయతీ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కౌరియా పంచాయతీ పరిధిలోని బీహ్త మిడిల్ స్కూల్‌లో కంతి కుమారి అనే మహిళ ఇంచార్జి హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే అదే పాఠశాలలో పని చేస్తున్న అసిస్టెంట్ టీచర్ […]
Viral Video | ఓ స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్ మధ్య చోటు చేసుకున్న గొడవ దాడులు చేసుకునే దాకా వచ్చింది. టీచర్‌ను చెప్పుతో కొట్టి.. కిందపడేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలోని కౌరియా పంచాయతీ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కౌరియా పంచాయతీ పరిధిలోని బీహ్త మిడిల్ స్కూల్‌లో కంతి కుమారి అనే మహిళ ఇంచార్జి హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే అదే పాఠశాలలో పని చేస్తున్న అసిస్టెంట్ టీచర్ అనితా కుమారికి, హెడ్ మాస్టర్‌కు మధ్య వ్యక్తిగత విబేధాలు ఉన్నాయి.
ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం వీరిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోగా మళ్లీ ఇటీవలే ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి. తరగతి గదిలోనే పిల్లల ముందే కంతి కుమారి, అనిత కుమారి గొడవ పడ్డారు.
View this post on Instagram
స్కూల్ బయట అనిత కుమారిని కింద పడేసి చితకబాదారు హెడ్ మాస్టర్, మరో టీచర్. చెప్పుతో ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ టీచర్ల వివాదంపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్పందించారు. హెడ్ మాస్టర్, అసిస్టెంట్ టీచర్ మధ్య నెలకొన్న విబేధాలు తమ దృష్టికి వచ్చాయని, వివరణ కోరామని తెలిపారు. వారి వివరణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి స్పష్టం చేశారు.
Viral Video | స్కూల్లోనే సిగపట్లు పట్టుకున్న హెడ్‌మాస్టర్, టీచర్ https://t.co/miT3hb1NWT #telugunews #telugu #MalliPelli #Salaar #SSMB28 pic.twitter.com/kPhZcIp8ye
— vidhaathanews (@vidhaathanews) May 26, 2023
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram