Viral Video | నెమలిని చూడగానే మనసు ఎంతో పులకించి పోతోంది. మయూరం నాట్యం చేస్తుంటే.. అలానే చూడాలనిపిస్తోంది. అలాంటి నెమలి ఓ అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. అసలు నెమలి అలా గాల్లో ఎగరడాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. అలా గాల్లో ఎగురుతూ అందరి దృష్టిని ఆకర్షించింది మయూరం. అత్యంత ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలపై ఓ నెమలి కూర్చుంది. ఇక సరదాగా నెమలి గాల్లోకి ఎగిరింది. ఓ పిట్ట ఎగురుతున్న మాదిరిగా.. నెమలి కూడా గాల్లోనే […]
Viral Video | నెమలిని చూడగానే మనసు ఎంతో పులకించి పోతోంది. మయూరం నాట్యం చేస్తుంటే.. అలానే చూడాలనిపిస్తోంది. అలాంటి నెమలి ఓ అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది.
అసలు నెమలి అలా గాల్లో ఎగరడాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. అలా గాల్లో ఎగురుతూ అందరి దృష్టిని ఆకర్షించింది మయూరం.
అత్యంత ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలపై ఓ నెమలి కూర్చుంది. ఇక సరదాగా నెమలి గాల్లోకి ఎగిరింది. ఓ పిట్ట ఎగురుతున్న మాదిరిగా.. నెమలి కూడా గాల్లోనే విహరిస్తూ ఉండిపోయింది. ఆ దృశ్యాలను పక్షి ప్రేమికులు తమ కెమెరాల్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
అయితే నెమళ్లు కొంత ఎత్తు వరకు మాత్రమే ఎగరగలుగుతాయి. కానీ ఈ నెమలి విద్యుత్ తీగల ఎత్తులో ఎగరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.