Peacock Feather Dance : నూకలు వేసింది..నాట్య మయూరిని చూసింది

నూకలు ఇచ్చిన యువతి ముందు నెమలి ఆకస్మాత్తుగా ఈకలు పురివిప్పి నాట్యం చేసి ఆశ్చర్యపరిచింది. ఆహారానికి ప్రతిగా అందమైన నృత్యంతో కృతజ్ఞత చెప్పిన వీడియో వైరల్.

Peacock Feather Dance : నూకలు వేసింది..నాట్య మయూరిని చూసింది

విధాత : తనకు ఆహారం అందించిన యువతికి ఓ నెమలి ఆశ్చర్యకరమైన బహుమతిని అందించింది. నేషనల్ పార్కును సందర్శించిన ఓ యువతి తనకు ఎదురుపడిన ఓ నెమలికి నూకలు, చిరు ధాన్యలు ఆహారంగా అందించింది. తన చేతిలో నుంచి కూడా ఆ నెమలి ఆహారపు గింజలు స్వీకరించింది. యువతి అందించిన ఆహారానికి మురిసిపోయిందో ఏమోగాని ఆ నెమలి ఆకస్మాత్తుగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..యువతి పట్ల తన కృతజ్ఞతను చాటింది.

ఆమె ముందే తన అందమైన ఈకలను పురివిప్పి ఆడుతూ నాట్య మయూరిగా కనువిందు చేసింది. ఊహించని రీతిలో నెమలి తన ముందు పురివిప్పి ఆడటంతో ఆ అద్బుతాన్ని చూసిన ఆ యువతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆ యువతి నెమలికి ఇచ్చిన నూకల కంటే..దాని నుంచి చాల పెద్ద గిఫ్టు అందుకుందని కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి :

Hyderabad Middle Class Housing Crisis | మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలపై నీళ్లు చల్లుతున్న భూముల ధరలు
Dog Robo Delivery : డెలివరీ చేసే డాగ్ రోబో.. డెలివరీ బాయ్స్ భవిష్యత్తు ఎట్లా!