African Bird Shoebill Stork| అఫ్రికా జఠాయువు..షుబిల్ స్టార్క్

రామాయణంలో జఠాయువు అనే భారీ పక్షికథ తెలిసిందే. నిజానికి అంతటి భారీ పక్షులు ఉన్నాయా అన్న సందేహాలకు సమాధానంగా పలు దేశాల్లో భారీ పక్షి జాతులు కనిపిస్తుంటాయి. అలాంటి భారీ పక్షి జాతుల్లో అఫ్రికా ఖండానికి చెందిన షుబిల్ స్టార్క్ పక్షి ఒకటి. తాజాగా ఓ భారీ షుబిల్ స్టార్క్ పక్షి ఓ పర్యాటకుల పడవపై దర్జాగా నిలుచున్న వీడియో వైరల్ గా మారింది.

African Bird Shoebill Stork| అఫ్రికా జఠాయువు..షుబిల్ స్టార్క్

విధాత : రామాయణంలో జఠాయువు అనే భారీ పక్షికథ తెలిసిందే. నిజానికి అంతటి భారీ పక్షులు ఉన్నాయా అన్న సందేహాలకు సమాధానంగా పలు దేశాల్లో భారీ పక్షి జాతులు కనిపిస్తుంటాయి. అలాంటి భారీ పక్షి జాతుల్లో అఫ్రికా ఖండానికి చెందిన షుబిల్ స్టార్క్ పక్షి(African Bird Shoebill Stork) ఒకటి. తాజాగా ఓ భారీ షుబిల్ స్టార్క్ పక్షి ఓ పర్యాటకుల పడవపై దర్జాగా నిలుచున్న వీడియో వైరల్ గా మారింది. పర్యాటకులను చూసి ఏ మాత్రం భయపడకుండా పడవపై నిలుచున్న షుబిల్ స్టార్క్ పక్షిని వారంతా ఆసక్తిగా తిలకించారు.

షూబిల్ కొంగ ఉగాండా , టాంజానియా, దక్షిణ సూడాన్, జాంబియా దేశాలతో సహా తూర్పు ఆఫ్రికాలోని దట్టమైన చిత్తడి నేలలు, మంచినీటి చిత్తడి నేలలో ఎక్కువగా కనిపిస్తాయని పక్షిజాతుల శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. షూబిల్ కొంగ శాస్త్రీయ నామం బాలెనిసెప్స్ రెక్స్(Baleariceps Rex ). బాలెనిసెప్స్ అనే జాతి పేరు వాస్తవానికి రెండు లాటిన్ పదాల కలయిక. వీటిని ఆంగ్లంలో “తిమింగలం తల” అని కూడా పిలుస్తారు. రెక్స్ అంటే లాటిన్‌లో రాజు లేదా పాలకుడు అని అర్థం. అందుకు తగ్గట్లుగానే ఈ పక్షి మిగతా పక్షు జాతులతో పోల్చుతే భారీ ఆకృతిలో కనిపిస్తుంటుంది. పెద్ద కళ్లు, అతిపెద్ద ముక్కు, బలమైన తల, మెడ, శరీరంతో ..పొడవైన కాళ్లు, విశాలమైన రెక్కలతో ఉండే షూబిల్ కొంగ 4.5 నుంచి 5.5 అడుగుల ఎత్తు,12 పౌండ్ల బరువుతో ప్రపంచంలోని అతిపెద్ద పక్షి జాతులలో ఒకటిగా గుర్తింపు పొందడం విశేషం. పసుపు, బూడిద, నీలం, తెలుపు రంగులో ఈ పక్షులు కనిపిస్తుంటాయి. చేపలు, నీటి పాములు, బల్లులు, తాబేళ్లు, కప్పలు వంటి వాటిని ఈ పక్షుల ఆహారం. జనారణ్యాల విస్తరణతో ఈ పక్షుల సంఖ్య 3,300 నుండి 5,300 వరకు మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. ఐయూసీఎన్(IUCN) రెడ్ లిస్ట్ ప్రస్తుతం దీనిని అంతరించిపోయే పక్షి జాబితాలో చేర్చింది.