Viral | ఈ మహిళ ధైర్యానికి నెటిజన్లు ఫిదా..! ఏకంగా సింహాలతో కలిసి నడుస్తోంది మరి..!

Viral Video | కొందరు మహిళలకు బల్లులను చూస్తేనే జడుసుకుంటారు. అలాంటిది ఏ మహిళ ఏకంగా మూడు సింహాలతో కలిసి వెళ్తున్నది. ఏమాత్రం భయం లేకుండా దర్జాగా వాటితో కలిసి వెళ్తున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నది. ఈ వీడియోను డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్ జెన్ షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు ఆరు మిలియన్ల మందికిపై వీక్షించగా.. వీడియోలో ఓ మహిళ మూడు సింహాలను బయటకు వెళ్తున్నట్లుగా ఉన్నది. ఈ వీడియోను […]

Viral | ఈ మహిళ ధైర్యానికి నెటిజన్లు ఫిదా..! ఏకంగా సింహాలతో కలిసి నడుస్తోంది మరి..!

Viral Video | కొందరు మహిళలకు బల్లులను చూస్తేనే జడుసుకుంటారు. అలాంటిది ఏ మహిళ ఏకంగా మూడు సింహాలతో కలిసి వెళ్తున్నది. ఏమాత్రం భయం లేకుండా దర్జాగా వాటితో కలిసి వెళ్తున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నది. ఈ వీడియోను డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్ జెన్ షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు ఆరు మిలియన్ల మందికిపై వీక్షించగా.. వీడియోలో ఓ మహిళ మూడు సింహాలను బయటకు వెళ్తున్నట్లుగా ఉన్నది.

ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు సదరు మహిళను ప్రశంసించారు. మూడు సింహాలు తమతో ఆమెను నడవడానికి అనుమతిస్తున్నాయంటే.. వాటికి ఆమె ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉండాలి’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. సింహాలను మచ్చిక చేసుకున్నా.. ఇప్పటికీ వాటికి జంతు ప్రవృత్తి ఉంటుందని మరో నెజిటన్‌ కామెంట్‌ చేశాడు.

ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమని మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు. సెకనులో మహిళను సగానికి చీల్చి వేసే ప్రమాదం ఉందని, సగం ధైర్యమైన సగం మూర్ఖత్వం అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. అయితే, ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో సింహాలకు సంబంధించిన వీడియోలు నిండి ఉండగా.. వాటి మధ్యలోనే మహిళ ఉండడం విశేషం.