Vishal | తమిళ హీరో విశాల్‌కి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విశాల్ షూటింగ్స్ లో పలుమార్లు గాయపడ్డాడు కూడా. అయినప్పటికీ రిస్క్‌లు చేస్తూ తన ఫ్యాన్స్‌ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇటీవల విశాల్ పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఫలానా హీరోయిన్‌తో విశాల్ పెళ్లి అని, లేదంటే ఆ అమ్మాయితో విశాల్ పెళ్లి త్వరలోనే జరగనుందంటూ అనేక ప్రచారాలు చేస్తున్నారు. ఈ వార్తలపై విశాల్ […]
Vishal |
తమిళ హీరో విశాల్‌కి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విశాల్ షూటింగ్స్ లో పలుమార్లు గాయపడ్డాడు కూడా. అయినప్పటికీ రిస్క్‌లు చేస్తూ తన ఫ్యాన్స్‌ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇటీవల విశాల్ పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ అవుతున్నాడు.
ఫలానా హీరోయిన్‌తో విశాల్ పెళ్లి అని, లేదంటే ఆ అమ్మాయితో విశాల్ పెళ్లి త్వరలోనే జరగనుందంటూ అనేక ప్రచారాలు చేస్తున్నారు. ఈ వార్తలపై విశాల్ కొన్ని సార్లు స్పందిస్తుండగా, మరి కొన్ని సార్లు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా విశాల్ ,లక్ష్మీ మీనన్ వివాహం చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారాలు సాగాయి.
ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి ఓకే చెప్పడంతో వారు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. దీంతో విశాల్ వెంటనే స్పందించాడు. తన సోషల్ మీడియా వేదికగా ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ… సాధారణంగా నేను ఇలాంటి పుకార్ల మీద స్పందించను. ఇలాంటి వాటిపై స్పందించడం అనవసరం అనుకుని వదిలేస్తాను.
కానీ ఈసారి స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. లక్ష్మీ మీనన్ తో నా వివాహం అంటూ జరుగుతున్న ప్రచారాలలో ఏ మాత్రం నిజం లేదు. ఆ వార్తలని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. లక్ష్మీ మీనన్ ఒక హీరోయిన్ కంటే అమ్మాయి కాబట్టి, ఈ వార్తల వలన ఆమె వ్యక్తిగత జీవితం, ఇమేజ్ దెబ్బతీసేలా ఈ వార్తలు ఉన్నాయి కాబట్టి స్పష్టత ఇచ్చానని విశాల్ చెప్పుకొచ్చారు.
నా పెళ్లి ఎప్పుడనేది అనవసరమైన డిస్కషన్. సమయం వచ్చినప్పుడు తప్పక నా పెళ్లి జరుగుతుంది. ఇక ఇప్పటికైనా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను, అందరిని దేవుడు చల్లగా చూడాలి అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు విశాల్. కాగా, లక్ష్మీ మీనన్- విశాల్ జంటగా పలనాడు, ఇంద్రుడు చిత్రాలు రూపొందడంతో ఈ ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని చెప్పుకొచ్చారు.
కానీ విశాల్ క్లారిటీ ఇవన్నీ అవాస్తవాలని తేలిపోయింది. ఇక ఇదిలా ఉంటే 2019లో విశాల్ హైదరాబాద్ కి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కాని ఏమైందో ఏమో వారి బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఇక విశాల్- వరలక్ష్మీ శరత్ కుమార్ మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.