Vishnu Kumar | విష్ణు కుమార్ కోరిక తీరింది.. BJP షోకాజ్ నోటీస్ ఇచ్చింది!
Vishnu Kumar విధాత: తలచినదే జరిగినదా.. దైవం ఎందులకు అన్నట్లుగా తాను కోరుకున్నది పార్టీ అధిష్టానం కూడా చేసింది.. ఇక ఇంకేముంది.. తానింకా ఫ్రీ బర్డ్.. విశాఖ నార్త్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిన BJP నాయకుడు విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar)కు BJP అధిష్టానం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఒక టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ BJP TDP జనసేన కలిసి వెళితే మంచిది అన్నట్లుగా అభిప్రాయ పడ్డారు. ఇక సీఎం […]
Vishnu Kumar
విధాత: తలచినదే జరిగినదా.. దైవం ఎందులకు అన్నట్లుగా తాను కోరుకున్నది పార్టీ అధిష్టానం కూడా చేసింది.. ఇక ఇంకేముంది.. తానింకా ఫ్రీ బర్డ్.. విశాఖ నార్త్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిన BJP నాయకుడు విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar)కు BJP అధిష్టానం షోకాజ్ నోటీసు ఇచ్చింది.
ఒక టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ BJP TDP జనసేన కలిసి వెళితే మంచిది అన్నట్లుగా అభిప్రాయ పడ్డారు. ఇక సీఎం వైయస్ జగన్ మీద యథావిధిగా విరుచుకు పడుతూ ఆయన్ను BJP ఏమి చేయడం లేదని, సీబీఐ సైతం ఆయన్ను ఇరుకున పెట్టడం లేదని అభిప్రాయ పడ్డారు. పొత్తుల గురించి సైతం తన సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు మనసంతా చంద్రబాబు చుట్టూరానే తిరుగుతోందనేది జగమెరిగిన సత్యం. బీజేపీ కోసం కాకుండా, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఆలోచిస్తారని అంటారు. అంతెందుకు గతంలో ఈయన అసెంబ్లీలోనే చంద్రబాబును శోభన్ బాబుతో పోలుస్తూ అప్పట్లో ఆయన కోసం అమ్మాయిలు పడి చచ్చిపోయే వారని కొనియాడారు.
ఈ విపరీత కామెంట్లు ఆరోజుల్లో తెగ విమర్శలకు గురయ్యేవి. ఆ తరువాత 2019లో ఓడిపోయాక కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని ఎన్నికల సీజన్ సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ అయన బయటకు వచ్చారు. కొంతకాలంగా ఆయన టీడీపీని పల్లెత్తు అననీయడం లేదు.. తనకు తానుగా బీజేపీ వీడాననే అపవాదు రాకుండా బీజేపీ నాయకత్వంతో గెంటి వేయించుకుని, సానుభూతి పొందేలా వ్యూహాలు రచిస్తున్నాడు..
అందులో భాగంగా ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీ పరిస్థితి బాగాలేదనే అర్థం వచ్చేలా, ఆ పార్టీకి నష్టం కలిగించేలా వున్నాయి.. పార్టీ ఘోరమైన తప్పిదాలు చేస్తోందని, ఇక్కడ వున్న పార్టీ పెద్దలకు పార్టీని డెవలప్ చేయాలనే ఆలోచన లేదనేలా వ్యాఖ్యానించారు. దీంతో పార్టీకి నష్టం కలిగించేలా ఇంటర్వ్యూలో అభిప్రాయాల్ని వెళ్ళడించడంపై వివరణ కోరింది. అయన రానున్న ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టిడిపి తరఫున పోటీ చేస్తారని అంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram