CM KCR | ఓటు మన రాతను రాసుకునే గొప్ప ఆయుధం: సీఎం కేసీఆర్
CM KCR | ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి.. ఓటు మన రాతను రాసుకునే గొప్ప ఆయుధం.. దాన్ని అలా వాడుకోవాలి.. అర్థం కానట్టు ఉంటే మన బతుకులు వ్యర్థం అవుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఇవాళ వరి ధాన్యం బాగా పండుతుంది.. పంటలతో పొలాలు కళకళలాడుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఒకనాడు మోటారు కాలిపోతే.. మంచికి రూ. 3 వేలు వసూలు […]

CM KCR | ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి.. ఓటు మన రాతను రాసుకునే గొప్ప ఆయుధం.. దాన్ని అలా వాడుకోవాలి.. అర్థం కానట్టు ఉంటే మన బతుకులు వ్యర్థం అవుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడారు.
ఇవాళ వరి ధాన్యం బాగా పండుతుంది.. పంటలతో పొలాలు కళకళలాడుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఒకనాడు మోటారు కాలిపోతే.. మంచికి రూ. 3 వేలు వసూలు చేసి ట్రాన్స్‌ఫార్మర్ తీసుకొచ్చేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్ ఏం మాట్లాడుతారంటే.. ఒకడేమో మీటర్లు పెట్టాలని, మరొకడేమో మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కరెంట్ కోతలు విధిస్తున్నారు. వెన్కట మనం పడ్డ బాధనే వాల్లు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ గతి మనకు రావాల్నా.. 24 గంటల కరెంట్ ఇట్లనే ఉండాల్నా. ఇవాళ ధరణి తెచ్చాం. వీఆర్‌వోలను తీసేశాం.ఒకరి భూమి మరొకరికి రాసి.. ఇబ్బందులు పెట్టారు. రాక్షసులా మాదిరిగా రాసి రంపాన పెట్టారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీసులను పెంచుకున్నాం. ఈ ఆఫీసుల ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు సులభంగా మారాయి. రైతుబంధు డబ్బులు కూడా సమయానికి ఇస్తున్నాం. రైతుబీమా కూడా వారం రోజుల్లో అందేలా చూస్తున్నాం. ఒక్కసారి కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నటువంటి ఆపద్భాందు గుర్తుకు తెచ్చుకోవాలి. ధరణి వల్ల నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతోంది.
ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా రాదు. రిజిస్ట్రేషన్లలో తప్పులు దొర్లుతాయి. ఒక్కసారి ధరణిలో భూమి ఎక్కితే మార్చే మొనగాడు లేడు. ధరణి వల్ల రైతు భూమికి హక్కు కల్పించాం. నీ బొటనవేలికే పవర్ ఉంది. రైతన్నలు ఆలోచన చేయండి.. మీకున్న అధికారాన్ని పొగొట్టుకుంటారా..? మళ్లా పైరవీకారుల మందల పాలవుతారా ఆలోచించండి. కాంగ్రెస్ వస్తే పైరవీకారులు మొదలవుతారు. గంటలు గంటలు పడిగాపులు పడాలి. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. మ్యుటేషన్ సులభంగా అయిపోతుంది. ధాన్యం డబ్బులు ఈజీగా వస్తున్నాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.