Erra Shekhar | కాంగ్రెస్‌లోకి ఎర్ర శేఖర్ ఎంట్రీ..? ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి చెక్ పెట్టేందుకేనా?
Erra Shekhar | ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా.. ప్రతి విషయం లో ప్రభుత్వాన్ని ఇరకాటం లో పడేసే వ్యాఖ్యలు చేస్తున్న అనిరుధ్ రెడ్డి ని రాజకీయంగా అనగదొక్కాలనే ఆలోచలనతో ఎర్ర శేఖర్‌ను తెర పైకి తెస్తున్నారా.. అని అంటే ఈ మధ్య జిల్లా లోని జడ్చర్ల నియోజకవర్గం లో జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి.

మూడు సార్లు జడ్చర్ల ఎమ్మెల్యేగా సేవలు
గతంలో టీడీపీలో బలమైన నేతగా గుర్తింపు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌లో చేరిక
గత ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్‌లో చేరిక
మళ్ళీ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు
సీఎం కూడా సుముకత తెలిపినట్లు సమాచారం
జడ్పీ చైర్మన్ పదవి కోరే అవకాశం
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి చెక్ పెట్టేందుకేనా?
Erra Shekhar | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా.. ప్రతి విషయం లో ప్రభుత్వాన్ని ఇరకాటం లో పడేసే వ్యాఖ్యలు చేస్తున్న అనిరుధ్ రెడ్డి ని రాజకీయంగా అనగదొక్కాలనే ఆలోచలనతో ఎర్ర శేఖర్‌ను తెర పైకి తెస్తున్నారా.. అని అంటే ఈ మధ్య జిల్లా లోని జడ్చర్ల నియోజకవర్గం లో జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే గా అనిరుద్ రెడ్డి గెలిచినప్పటి నుంచి రేవంత్ రెడ్డి కి వ్యతిరేకం గానే పనిచేస్తున్నారనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరునిగా గుర్తింపు ఉండడం కూడా అనిరుద్ రెడ్డి కి జిల్లా లో ని కాంగ్రెస్ నేతలతో సఖ్యత లేదు. జిల్లా లో ఎమ్మెల్యే అందరూ రేవంత్ రెడీ కి అనుకూలంగా ఉంటే ఈ ఎమ్మెల్యే ఒక్కరే వ్యతిరేకం గా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి విషయం లో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక స్వరం వినిపించడం తో సీఎం రేవంత్ రెడీ ఆయనను దూరం పెట్టారు. జిల్లా కు చెందిన వ్యక్తి ని ముఖ్య మంత్రిగా ఉన్నా తనకు వ్యతిరేకంగా పనిచేయడంతో రేవంత్ రెడ్డికి ఆ ఎమ్మెల్యే శైలి మింగుడు పడడం లేదు. ఎలాగైనా అనిరుధ్ రెడ్డి కి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బలమైన నేతను జడ్చర్లలో ఉంచాలని నిర్ణయించు కున్నట్లు సమాచారం. ఇందుకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను వీడిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (మరాటి చంద్రశేఖర్ )మళ్ళీ పార్టీ లోకి తెచ్చేందుకు పావులు కడుపుతున్నట్లు తెలిసింది. గతం లో టీడీపీ లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి, ఎర్ర శేఖర్ కు మంచి స్నేహ బంధం ఉంది. ఈ అనుబంధం తో బీజేపీ లో ఉన్న ఎర్ర శేఖర్ ను కాంగ్రెస్ పార్టీ లోకి తెచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను వీడిన ఎర్ర శేఖర్ ను మళ్ళీ కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
జడ్చర్ల నియోజకవర్గం లో టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన అనుభవం ఎర్ర శేఖర్ కు ఉండడం, బీసీలో ని ముదిరాజ్ వర్గానికి చెందడం కూడా కొత్త రాజకీయంగా అనుకూలించే అవకాశం ఉండడం తో రేవంత్ రెడ్డి ఆయనను పార్టీ లోకి తీసుకోచ్చే ప్రయత్నం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జడ్చర్ల,నారాయణ పేట నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అనుకున్న ఎర్ర శేఖర్ కు రెండు స్థానాల్లో టికెట్ లభించలేదు. వెంటనే బీ ఆర్ ఎస్ లో చేరి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు వ్యతిరేకం గా ప్రచారం చేశారు. అయినా ఆయన మాటలు ప్రజలు నమ్మకపోవడం జడ్చర్ల, నారాయణ పేట నియోజకవర్గం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎర్ర శేఖర్ వల్ల ఉపయోగం లేదని భావించిన గులాబీ పార్టీ ఆయనను పక్కన బెట్టింది. అప్పటినుంచి ఆయన ఆ పార్టీ కి దూరంగా ఉన్నారు. ఇదే అవకాశం గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు ఎర్ర శేఖర్ ను పార్టీ లోకి ఆహ్వానిస్తున్నారు. ఎర్ర శేఖర్ ను ఇప్పటికే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలిసినట్లు తెలిసింది. ఇందుకు ఆయన కూడా సుముకంగా ఉన్నట్లు సమాచారం.
జడ్పీ చైర్మన్ పదవి కోసమేనా?
మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించడం.. ఆ స్థానం పై గురి పెట్టిన ఎర్ర శేఖర్ కూడా కాంగ్రెస్ నీడన చేరి ఆ పదవిలో తన భార్యను కూర్చోబెట్టాలనే ఉదేశ్యంతో కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు సిద్ధం అయినట్లు కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఈ పదవి పై ఆశలు పెట్టుకున్న ఆయన ముందుగానే సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఇదే జరిగితే జడ్చర్ల నియోజకవర్గం లోని మిడ్జిల్ మండలం నుంచి తన భార్యను కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీ బరిలో పోటీలో ఉంచి అక్కడి నుంచి గెలిపించి జడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలనే ఉదేశ్యంతో ఎర్ర శేఖర్ ఉన్నారు. గతంలో కూడా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలం నుంచి జడ్పీటీసీ గా ఎన్నికై తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎర్ర శేఖర్ కూడా తన భార్య ను ఇక్కడి నుంచి పోటీ చేయించే పనిలో పడ్డారు. రేవంత్ రెడ్డి అండ ఉంటే గెలుపు తథ్యం అనే ధోరణి లో ఎర్ర శేఖర్ ఉన్నారు. ఈయన రాకకు కూడా రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ పదవి కోసం చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆశ పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా నిలిచి ఆయన గెలుపు లో పాలుపంచుకున్న కొందరు నేతలు జడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ఈ జడ్పీ పరిధిలో మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలు ఉండడం తో ఈ ముగ్గురు ఎమ్మెల్యే లు ఎవరికి మద్దతుగా ఉంటారో తొందరలోనే తెలుస్తుంది.