Warangal | రాజ్యాధికారంలో బీసీలకు సముచిత వాటా లక్ష్యం: హనుమంతరావు

Warangal ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు బీసీలకు మోడీ తీరని అన్యాయం బిఆర్ఎస్‌కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే ఆగస్టులో సూర్యాపేటలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ తోనే బడుగు వర్గాలకు న్యాయం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనాభాలో సగాని కంటే ఎక్కువగా ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో సముచిత స్థానం సాధించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు వెల్లడించారు. […]

Warangal | రాజ్యాధికారంలో బీసీలకు సముచిత వాటా లక్ష్యం: హనుమంతరావు

Warangal

  • ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు
  • బీసీలకు మోడీ తీరని అన్యాయం
  • బిఆర్ఎస్‌కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే
  • ఆగస్టులో సూర్యాపేటలో బీసీ గర్జన సభ
  • కాంగ్రెస్ తోనే బడుగు వర్గాలకు న్యాయం
  • కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనాభాలో సగాని కంటే ఎక్కువగా ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో సముచిత స్థానం సాధించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు వెల్లడించారు. ఓ బి సికి చెందిన మోడీ ప్రధానిగా ఉన్నా, వారికి ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు.

హనుమకొండలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క బిసికి న్యాయం చేయలేదని విమర్శించారు. పైగా కుల గణన చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మోడీ బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి అంటూ విమర్శించారు. బీసీలకు అన్యాయం జరిగితే తాము సహించమని అన్నారు.

మూడు అసెంబ్లీ స్థానాలు డిమాండ్

రానున్న ఎన్నికల్లో ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీసీలకు మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు హనుమంతరావు చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించామని వివరించారు.

సూర్యాపేటలో బీసీ గర్జన సభ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెలలో సూర్యాపేట కేంద్రంగా బీసీ గర్జన సభ నిర్వహించనున్నట్లు విహెచ్ చెప్పారు. ఈ సభకు రాహూల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరవుతారని వెల్లడించారు. ఒక్క అగ్రకులాల ఆధిపత్యం సాగదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా, ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా సాగుతుందన్నారు.

బీసీలకు కేసీఆర్ అన్యాయం

రాష్ట్రంలో కూడా తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఇటీవల బిఆర్ఎస్‌గా మారిందని వీహెచ్ విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిందని వివరించారు. ఇప్పుడు ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అంటూ దేశంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసిన విషయం కెసిఆర్ మరిచిపోయారని, భువనగిరిలో తమ భూమి ఓఆర్ఆర్‌కు ఇవ్వమని రైతులు అంటే బేడీలు వేసిన చరిత్ర నీదంటూ విమర్శించారు.

బీఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే

రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనని హనుమంతరావు హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఇనగాల వెంకట్రాం రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యులు నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి కార్యదర్శి ఈ.వి. శ్రీనివాస్ రావు, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, బంక సరళ, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, గుంటి స్వప్న, NSUI జిల్లా అధ్యక్షుడు పల్లకొండ సతీష్, తదితర నాయకులు పాల్గొన్నారు.