Warangal | వైభవంగా.. భద్రకాళి శాఖాంబరి ఉత్సవం
Warangal | శాకాంబరి అలంకరణలో భద్రకాళి దర్శించుకున్న భక్తజన సందోహం వరంగల్లో భద్రకాళి నామస్మరణ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రసిద్ధి చెందిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో సోమవారం శాకంబరి ఉత్సవాలు అంగరావంగా వైభవంగా జరిగాయి. గత వారం రోజులుగా జరుగుతున్న శాఖాంబరి ఉత్సవాలలో భాగంగా సోమవారం భద్రకాళి అమ్మవారికి కూరగాయలతో అలంకరించారు. ఆషాడ మాసంలో జరిగే ఈ ఉత్సవాలలో శాఖాంబరి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. శాకాంబరధారిగా భద్రకాళి భక్తులకు దర్శనం ఇచ్చారు. శాకాంబరి ఉత్సవాల […]

Warangal |
- శాకాంబరి అలంకరణలో భద్రకాళి
- దర్శించుకున్న భక్తజన సందోహం
- వరంగల్లో భద్రకాళి నామస్మరణ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రసిద్ధి చెందిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో సోమవారం శాకంబరి ఉత్సవాలు అంగరావంగా వైభవంగా జరిగాయి. గత వారం రోజులుగా జరుగుతున్న శాఖాంబరి ఉత్సవాలలో భాగంగా సోమవారం భద్రకాళి అమ్మవారికి కూరగాయలతో అలంకరించారు. ఆషాడ మాసంలో జరిగే ఈ ఉత్సవాలలో శాఖాంబరి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. శాకాంబరధారిగా భద్రకాళి భక్తులకు దర్శనం ఇచ్చారు. శాకాంబరి ఉత్సవాల కోసం ఐదు టన్నుల కూరగాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అర్చకులు అలంకరించారు.
దండాలు కూల్చడంలో మహిళా భక్తుల భాగస్వామ్యం
ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు మహిళా భక్తులు కూరగాయలను, ఆకు కూరలను దండలుగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యమై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. అనంతరం భద్రకాళిని ఆలయ అర్చకులు ఆ మాలలతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా అలంకరించారు. దీంతో భక్తులకు శాకంబరీ రూపంలో భద్రకాళి దర్శనం ఇచ్చారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. భద్రకాళి నామస్మరణ తో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భద్రకాళి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో భారతి ఆధ్వర్యంలో సిబ్బంది విజయ్, శ్యామ్ తదితరులు భక్తుల సహకారంతో చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే చలో పందేలు వేయగా మంచినీటి వసతి ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఇతర అర్చకులు భక్తులకు భద్రకాళీ దర్శనానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.
భక్తులకు భద్రకాళి ఆశీర్వాదం లభించే విధంగా కృషి చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడక్కడ చిన్నచిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని పట్టించుకోకుండా భక్తులు భద్రకాళిని దర్శించుకున్నారు.