Warangal | గురుకుల విద్యార్థిని గుగులోతు మమతకు అంతర్జాతీయ గుర్తింపు

Warangal మమత తీసిన ఫొటో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ వోగ్‌ ఇటాలియకు ఎంపిక అభినందించిన రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫొటోగ్రఫీ కోర్సు చేస్తున్న గుగులోతు మమతను రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మమత తీసిన గిరిజన మహిళ చిత్రం ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ 'వోగ్ ఇటాలియా'లో […]

Warangal | గురుకుల విద్యార్థిని గుగులోతు మమతకు అంతర్జాతీయ గుర్తింపు

Warangal

  • మమత తీసిన ఫొటో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ వోగ్‌ ఇటాలియకు ఎంపిక
  • అభినందించిన రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫొటోగ్రఫీ కోర్సు చేస్తున్న గుగులోతు మమతను రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మమత తీసిన గిరిజన మహిళ చిత్రం ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్ ఇటాలియా’లో ప్రచురితమవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాసంలో తన ఛాంబర్ లో గుగులోతు మమతను మంత్రి సత్యవతి రాథోడ్ గారు ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

మమతతోపాటు అధికారులను, కళాశాల ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ సోమనాథ్ శర్మ, ఓ ఎస్ డి అశ్విని, ఫోటోగ్రఫీ అధ్యాపకులు రఘు తదితరులు పాల్గొన్నారు.