Warangal | జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య

Warangal వరంగల్ జిల్లాలో సంఘటన కుటుంబ కలహాలే కారణం అంటున్న పోలీసులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో పనిచేస్తున్న సోనీ సమ్మె విరమించి రెండు రోజుల క్రితమే ఆమె విధుల్లో చేరింది. విధుల్లో చేరిన రెండు రోజులకే సోని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది. సంఘటన సమాచారం తెలియగానే హస్పిటల్‌కు చేరుకుని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి […]

Warangal | జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య

Warangal

  • వరంగల్ జిల్లాలో సంఘటన
  • కుటుంబ కలహాలే కారణం అంటున్న పోలీసులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో పనిచేస్తున్న సోనీ సమ్మె విరమించి రెండు రోజుల క్రితమే ఆమె విధుల్లో చేరింది. విధుల్లో చేరిన రెండు రోజులకే సోని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది.

సంఘటన సమాచారం తెలియగానే హస్పిటల్‌కు చేరుకుని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబాన్ని ఓదార్చారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సమ్మెలో సోని కూడా పాల్గొంది. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం తిరిగి ఆమె విధుల్లో చేరింది. విధుల్లో చేరిన తరువాత సోని ఆత్మహత్యకు పాల్పడడం చర్చకు దారి తీసింది.

ప్రభుత్వం అనుసరించిన పద్ధతికి మనస్థాపం చెంది సోని ఆత్మహత్యకు పాల్పడిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కుటుంబ కలహాలే సోని ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.