కడుపులో ఉన్న కవలలు మృతి.. మనస్తాపంతో తండ్రి, చికిత్స పొందుతూ తల్లి మృతి
శంషాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గర్భిణి కడుపులో ఉన్న కవల పిల్లలు మృతి చెందారు. దీంతో చికిత్స పొందుతూ తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. పిల్లలు, భార్య మృతి తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్యతో కలిసి సామ ఎన్ క్లేవ్ లో నివాసముంటున్నారు
విధాత: శంషాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గర్భిణి కడుపులో ఉన్న కవల పిల్లలు మృతి చెందారు. దీంతో చికిత్స పొందుతూ తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. పిల్లలు, భార్య మృతి తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్యతో కలిసి సామ ఎన్ క్లేవ్ లో నివాసముంటున్నారు. ఏడేళ్ల కిందటే వివాహం జరిగినా పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా శ్రావ్య గర్భం దాల్చింది.
8 నెలల కడుపుతో ఉన్న శ్రావ్యకు కడుపునొప్పి రావడంతో శ్రావ్య తల్లి అత్తాపూర్ లోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. దీంతో కడుపులో ఉన్న కవలలు చనిపోయారని వైద్యులు చెప్పారు. దీంతో మన స్తాపానికి గురైన విజయ్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శ్రావ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు గుడిమల్కాపూర్లోని మైత్రి ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ కాసేపటికే శ్రావ్య కూడా మృతి చెందింది. ఈ విషయం చెబుదామని విజయ్ కి కాల్ చేస్తే ఎంతసేపటికీ ఆన్సర్ చేయకపోవడంతో కుటుంబసభ్యుులు ఇంటికి వచ్చి చూడగా, ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram