Warangal | కేటీఆర్.. అహంకారం తగ్గించుకో..: బలరాం నాయక్
Warangal బీఆర్ఎస్ అంటేనే చీటింగ్ అమ్ముడుపోవడం, కొనుక్కోవడం మీకు అలవాటు సోనియా తెలంగాణ ఇయ్యకుంటే కెసిఆర్ సీఎం అయ్యేవాడా ఏడు మండలాలను అమ్ముకుందెవరు మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేటీఆర్ కాస్త అహంకారం తగ్గించుకో, కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదనే అహంకారపూరిత మాటలు మాట్లాడడం నీకూ, నీ అయ్యకే చెల్లుతుందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ మండిపడ్డారు. తల్లి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే మీ బతుకేంటో తెలుసుకో ? […]

Warangal
- బీఆర్ఎస్ అంటేనే చీటింగ్
- అమ్ముడుపోవడం, కొనుక్కోవడం మీకు అలవాటు
- సోనియా తెలంగాణ ఇయ్యకుంటే కెసిఆర్ సీఎం అయ్యేవాడా
- ఏడు మండలాలను అమ్ముకుందెవరు
- మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేటీఆర్ కాస్త అహంకారం తగ్గించుకో, కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదనే అహంకారపూరిత మాటలు మాట్లాడడం నీకూ, నీ అయ్యకే చెల్లుతుందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ మండిపడ్డారు. తల్లి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే మీ బతుకేంటో తెలుసుకో ? కెసిఆర్ నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా? మీ బతుకులు ఎలా ఉండేవో ఆత్మ విమర్శ చేసుకో అంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత, స్థాయి నీకు లేదని కేటీఆర్ కు హితవు పలికారు.
మహబూబాబాద్‌లో టీపీసీసీ ఆదివాసీ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌తో కలిసి బలరాం నాయక్ శనివారం మీడియాతో మాట్లాడారు. మానుకోట పర్యటనలో నిన్న మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే చీటింగ్ అంటూ విమర్శించారు. ఆ పార్టీ నాయకులకు మాటలు తప్ప, చేతలు ఉండవని, పని చేసే నాయకులను చీటింగ్ చేయడం అలవాటైందని అన్నారు.
కేసీఆర్ కేటీఆర్ తో సహా అమ్ముడు పోయింది వాళ్లు, కొనుక్కుంది వాళ్ళు అంటూ విమర్శించారు. రైతుల కళ్లాల్లో ధాన్యం కొనేందుకు వెనుకంజ వేస్తారనీ, ఎమ్మెల్యేలను కొనుక్కోవడంలో ముందుంటారని, మీ పార్టీ నాయకులకు అవే లక్షణాలు ఉన్నాయని ఆరోపించారు.
తెలంగాణ రాగానే ఖమ్మం జిల్లాలోని సీలేరు, ఏడు ఏజెన్సీ మండలాలను పార్లమెంటు సాక్షిగా అమ్ముకుంది మీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మేము సత్యం చెబితే మమ్మల్ని తిడతావా అంటూ నిలదీశారు. మదం, క్రోధం పెరిగితే అలాగే మాట్లాడతారంటూ మండిపడ్డారు.
మానుకోటకు ఎస్సారెస్పీ నీళ్లు, కేంద్రీయ విద్యాలయం, రోడ్లు, గిరిజన అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు, వైయస్ హయాములో పోడుపట్టాలు అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ లంబాడాలను ఎస్టీలలో కలపకపోతే ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎన్నికయ్యేవారా? నేను కేంద్ర మంత్రిని అయ్యేవాడినా అంటూ ప్రశ్నించారు.
అమ్ముడు పోయింది మీ నాయన రెడ్యానాయక్ అంటూ తండ్రీ, బిడ్డలు కమీషన్లకు కక్కుర్తి పడడం తప్ప డోర్నకల్ కు ఏం చేశారని ప్రశ్నించారు. డోర్నకల్, మానుకోటకు నాగార్జునసాగర్ నీళ్లు రాకుండా అడ్డుకున్నారని ఎంపీ కవితను ఉద్దేశించి మంత్రి అన్నారు
ఎవరు భూ కబ్జా కోర్లు: బెల్లయ్య నాయక్ ప్రశ్న
బీఆర్ఎస్ చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అమలు చేశావు కేటీఆర్ అంటూ బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాలు ఎక్కడ పోయాయని నిలదీశారు. మానుకోట కలెక్టరేట్ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించిందెవరు అంటూ నిలదీశారు. ముగ్గురు నాయకులు కేటీఆర్ ను జోకుతున్నారని ఎద్దేవా చేశారు.
పంచాయతీలకు నిధులు రాక సర్పంచులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని, వారి బతుకులు రోడ్ల మీద పడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎగిరి ఎగిరి పడితివి కదా ఈరోజు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి అయిపోయింది. ఇక నీ దుకాణం కూడా ఖాళీ అయిపోతుందని విమర్శించారు.
రేపు ఖమ్మంలో జరిగే జరగబోయే తెలంగాణ జనగర్జన భారీ సభకు ముఖ్యఅతిథిగా రాహుల్ గాంధీ హాజరుకానున్నారని చెప్పారు. మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వాకాటి శ్రీహరి,పార్లమెంట్ ఇంచార్జి రాజిరెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యాదవ్ రెడ్డి, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నునవత్ రాధ,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.