Warangal | శ్రమదానంతో పాకాల కొత్తగూడ రోడ్డు గుంతలను పూడ్చిన ఎమ్మెల్యే సీతక్క
Warangal పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుంతలరోడ్డుతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు రోడ్డుకు నిధులు మంజూరైనా అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట జిల్లా పాకాల కొత్త గూడ రోడ్డు గుంతలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం శ్రమదానంతో పూడ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమన్నారు. ముఖ్యంగా కొత్తగూడ - గంగారాం […]

Warangal
- పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
- గుంతలరోడ్డుతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు
- రోడ్డుకు నిధులు మంజూరైనా అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట జిల్లా పాకాల కొత్త గూడ రోడ్డు గుంతలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం శ్రమదానంతో పూడ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమన్నారు. ముఖ్యంగా కొత్తగూడ – గంగారాం మండలాలకు నూతన రోడ్లు మంజూరయ్యాయని చెప్పారు. రోడ్డు వేసేందుకు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో టెండర్ పూర్తి చేసుకొని మధ్యలోనే పనులు అగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోడ్లు అధ్వానంగా తయారు కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీస బస్ సౌకర్యం లేని గ్రామాలు అనేకం ఉన్నాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదిన్నర సంవత్సరాలు గడుస్తున్నా రోడ్ల దుస్థితి ఏ మాత్రం మారడం లేదని అన్నారు.
రోడ్ల మరమ్మత్తుల కోసం నూతన రోడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు మంజూరు చేయిస్తున్నా ఫారెస్ట్ అధికారులు అనుమతులు లేవని అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరువ తీసుకొని వెనుకబడిన కొత్త గూడ, గంగారాం మండలాల అభివృద్ధికి కృషి చేయాలని సీతక్క డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ,సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.