Warangal | అన్నదాతను మోసం చేస్తే PD యాక్ట్ నమోదు: CP రంగ‌నాథ్‌

Warangal వ్యాపారి రవిబాబు పై పీడీ కేసు నమోదు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయదారులను మోసానికి గురిచేసే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఎగవేతకు పాల్పడినందుకుగాను కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన రవిశెట్టి రవిబాబు అనే నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా పిడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. పోలీస్ కమిషనర్ […]

Warangal | అన్నదాతను మోసం చేస్తే PD యాక్ట్ నమోదు: CP రంగ‌నాథ్‌

Warangal

  • వ్యాపారి రవిబాబు పై పీడీ కేసు నమోదు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయదారులను మోసానికి గురిచేసే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఎగవేతకు పాల్పడినందుకుగాను కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన రవిశెట్టి రవిబాబు అనే నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా పిడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు.

పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నిందితుడికి సోమవారం ఏసీపీ కార్యాలయంలో అందజేసి చర్లపల్లి జైలుకి తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ వివరాలను వెల్లడిస్తూ నిందితుడు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ దారుల నుండి సుమారు 6 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు చెల్లించాల్సి సుమారు కోటిన్నర పైగా ధాన్యం డబ్బులు చెల్లించకుండా డబ్బు ఎగవేతకు పాల్పడ్డారు.

ఈ విషయం పై వ్యవసాయదారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎల్కతుర్తి, ముల్కనూరు, వంగర పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదు చేశారు. దీంతో నిందితుడిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయదారుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి వ్యాపారస్తులు సకాలంలో చెల్లింపులు చేయాలని, అలాకాకుండా వారికి ఇచ్చే డబ్బులు ఎగవేత ధోరణికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు.

దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచే రైతన్నకు బాసటగా నిలువాల్సిన బాధ్యత మనందరి పై వుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఎల్కతుర్తి ఇన్స్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ మహేందర్ పాల్గొన్నారు