Warangal | చేతిపై KCR పేరు పచ్చ బొట్టు వేయించుకున్న సత్యవతి రాథోడ్
Warangal తమ నేత పై అభిమానం చాటుకున్న మంత్రి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తమ నేత పై ఉన్న అభిమానంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై కేసీఆర్ పేరు పచ్చ బొట్టు వేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ బంజారా భవన్‌లో శనివారం జరిగిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గిరిజన స్టాల్స్ ను సదర్శిస్తున్న సమయంలో పచ్చబొట్టు […]

Warangal
- తమ నేత పై అభిమానం చాటుకున్న మంత్రి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తమ నేత పై ఉన్న అభిమానంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై కేసీఆర్ పేరు పచ్చ బొట్టు వేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ బంజారా భవన్‌లో శనివారం జరిగిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
గిరిజన స్టాల్స్ ను సదర్శిస్తున్న సమయంలో పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయాలని సూచించారు. నిర్వాకులు పచ్చబొట్టు నొప్పితో కూడినది అని చెప్పినా మంత్రి కేసీఆర్ పేరును వేయాలి అని వారికి తెలిపారు. నొప్పిని భరిస్తూ పచ్చబొట్టు వేయించుకున్నారు.
కొమురం భీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రికి పచ్చబొట్టు వేశారని తెలుసుకుని మంత్రి ఆనందించారు. పచ్చబొట్టు వేసినందుకు నగదు బహుమానం అందించారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతులను ప్రోత్సహించాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.