Warangal | నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: దాస్యం
Warangal సంక్షేమం, అభివృద్ధిలో ప్రాధాన్యత గుడిసెవాసుల కాలనీల్లో పర్యటన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని గుడిసెవాసులు నివసిస్తున్న ప్రాంతాల్లో అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు గూడు నీడ కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెం 58ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. గుడిసెవాసుల నలబై ఏళ్ళ నిరీక్షణను […]

Warangal
- సంక్షేమం, అభివృద్ధిలో ప్రాధాన్యత
- గుడిసెవాసుల కాలనీల్లో పర్యటన
- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని గుడిసెవాసులు నివసిస్తున్న ప్రాంతాల్లో అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు గూడు నీడ కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెం 58ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు.
గుడిసెవాసుల నలబై ఏళ్ళ నిరీక్షణను తీర్చిన ఘనత కెసిఆర్ దేనని అన్నారు. అవగాహన లేక చాలా మంది గుడిసెవాసులు దరఖాస్తు చేసుకోవడం లేదని, క్షేత్ర స్థాయిలో నిరుపేదలకు అవగాహన కల్పించేందుకే గుడిసెవాసుల ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని చెప్పారు.
75 సంవత్సరాలు కాంగ్రెస్, బీజేపిలు పాలించినా నిరుపేదలను పట్టించుకున్న తావు లేదని, నిరుపేదలకు భద్రతా భరోసాను ప్రభుత్వం కల్పిస్తున్నదని అన్నారు. ఇప్పటికే చాలా మందికి 58 జీవో పట్టాలను అందించామని, మొన్న పోచమ్మకుంటలో పట్టాల పంపిణీ పండగ వాతావరణం సంతరించుకుందని, కాజీపేట, హన్మకొండలోని గుడిసె వాసులకు అవగాహన కల్పించామని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు కల్పించాలనే నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నానని, గత ప్రభుత్వాలు నిరుపేదలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలేక పోయాయని తెలిపారు. అర్హులైన పేదలు ప్రతి ఒక్కరూ ఈనెల 30వ తేదీలోపు 58 జీవో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అధికారులతో సమన్వయం చేసుకొని హక్కు కల్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. వరంగల్ లోనీ పోతన నగర్, రఘునాథ్ కాలనీ, ఓ ఎస్ నగర్ లో పర్యటించారు.
కార్యక్రమంలో ఆర్డీవోలు వాసు చందర్, మహేందర్, తహసీల్దార్ సత్యపాల్ రెడ్డి, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, డివిజన్ అధ్యక్షులు సదాంత్, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.