Warangal | చెత్త కుప్పల నుంచి చదువులమ్మ ఒడికి..
Warangal బాల్యం పనిలో కాదు బడిలో గడవాలి.. 11 మంది బాల కార్మికులను గురుకులాల్లో చేర్చిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పెన్ను, పుస్తకం పట్టాల్సిన చేతులు చెత్తను ఏరుకోవద్దని, బడిలో గడవాల్సిన బాల్యం చెత్త కుప్పల వద్దకు చేరవద్దని ప్రభుత్వ చీఫ్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలో బాల కార్మికులుగా మారి చెత్త సేకరిస్తున్న 11 మంది పిల్లలను ఆయన ప్రభుత్వ గురుకుల పాఠశాలలో […]

Warangal
- బాల్యం పనిలో కాదు బడిలో గడవాలి..
- 11 మంది బాల కార్మికులను గురుకులాల్లో చేర్చిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పెన్ను, పుస్తకం పట్టాల్సిన చేతులు చెత్తను ఏరుకోవద్దని, బడిలో గడవాల్సిన బాల్యం చెత్త కుప్పల వద్దకు చేరవద్దని ప్రభుత్వ చీఫ్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలో బాల కార్మికులుగా మారి చెత్త సేకరిస్తున్న 11 మంది పిల్లలను ఆయన ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించారు.
ఈ సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆట పాటలతో ఆనందంగా గడవాల్సిన బాల్యం ఆగం కావద్దని కోరారు. ఆ బాల కార్మికులకు పుస్తకాలు అందజేశారు. దగ్గర ఉండి వారికి అన్నం పెట్టారు. వారితౌ కలిసి భోజనం చేసి వారికి ప్రేమను పంచారు.
బాల కార్మికుల తల్లిదండ్రులకు ఆ విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఆ బాల కార్మికుల తల్లిదండ్రులను ఒప్పించి వారిని గురుకులాల్లో చేర్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య తెలంగాణలో అందుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న గురుకులాలను చదువు చెప్పించే ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు తప్పకుండ సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.
పిల్లల బాల్యం కచ్చితంగా బడిలోనే గడవాలని పనిలో కాదని అన్నారు. వీధి బాలలను గుర్తించి వారిని బడిలో చేర్పించడంలో సహకరించిన లక్ష్మీ అనే మహిళను ప్రభుత్వ చీఫ్ విప్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మైనారిటీ శాఖ ఈడి శ్రీనివాస్, చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.