బీజేపీ మోసాలు ఎండగడతాం: కాంగ్రెస్

మహిళా రిజర్వేషన్ బిల్లు పై కాంగ్రెస్ క్యాంపెయిన్
విధాత: మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో బీజేపీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రధాన పట్టణాల్లో కాంగ్రెస్ క్యాంపెయిన్ నిర్వహించనుంది. బీజేపీ చేస్తున్న మోసాలను ప్రజల్లో బహిర్గతం చేయడానికి ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టింది.
అహ్మదాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్, హైద్రాబాద్ లో మహిళా కాంగ్రెస్ చీఫ్ నేత డి-సౌజా సోమవారం ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించారు. విడివిడిగా జరిగే ఈ కాన్ఫరెన్సుల్లో 21 మంది మహిళా కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. వీరంతా బీజేపీ చేస్తున్న రాజకీయ మోసాలను ప్రజల్లో ఎండగడతారు.
రంజిత్ రంజన్ మహిళా కాంగ్రెస్ నేత భువనేవశ్వర్ లోనూ, అల్కా లాంబా జైపూర్ లో, అమీ యాగ్నిక్ ముంబయిలో, రాగినీ నాయక్ రాంచీ, శమా మొహమ్మద్ శ్రీ నగర్ లో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తారు. కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ డిపార్ట్ మెంట్ హెడ్ పవన్ ఖేడా తాజాగా వివరణ ఇస్తూ, 21 పట్టణాల్లో 21 మంది మహిళా లీడర్లు ఈ కాన్ఫరెన్సులు నిర్వహిస్తారు.
బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో చేస్తున్నమోసాలను వీరు ప్రజల్లో ఎండగడతారని ఆయన తన ట్విట్టర్ పోస్టు లో తెలిపారు. వరుసగా ఈ ప్రెస్ కాన్ఫరెన్సు లు విజయవాడ, సిమ్లా, పాట్నా, నాగ్ పూర్, లక్నో, కలకత్తా, జమ్మూ, గౌహతి, గోవా, డెహ్రా డూన్, చెన్నయ్, ఛండీఘడ్, బెంగుళూర్ లలో నిర్వహిస్తారు.