WFI | భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ రద్దు

ప్రపంచ బోర్డు సంచనల నిర్ణయం WFI | న్యూఢిల్లీ : రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాను రెజ్లింగ్‌ ప్రపంచ బోర్డు సస్పెండ్ చేసింది. ఈ ఏడాది జూన్‌ నాటికి ఫెడరేషన్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. ఇంత వరకూ నిర్వహించకపోవడంతో యునైటెడ్‌ వరల్డ్‌ ఆఫ్‌ రెజ్లింగ్‌ ఈ చర్య తీసుకున్నది. ఇప్పటికే ఫెడరేషన్‌ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు ఢిల్లీలో దీర్ఘకాలం […]

  • By: Somu    latest    Aug 24, 2023 12:53 PM IST
WFI | భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ రద్దు
  • ప్రపంచ బోర్డు సంచనల నిర్ణయం

WFI | న్యూఢిల్లీ : రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాను రెజ్లింగ్‌ ప్రపంచ బోర్డు సస్పెండ్ చేసింది. ఈ ఏడాది జూన్‌ నాటికి ఫెడరేషన్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. ఇంత వరకూ నిర్వహించకపోవడంతో యునైటెడ్‌ వరల్డ్‌ ఆఫ్‌ రెజ్లింగ్‌ ఈ చర్య తీసుకున్నది. ఇప్పటికే ఫెడరేషన్‌ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై వారు ఢిల్లీలో దీర్ఘకాలం పాటు ఆందోళన చేశారు. జూన్‌లో ఎన్నికలు జరపాల్సి ఉన్నా.. వరుస ఆందోళనల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా ఫెడరేషన్‌ రద్దు నేపథ్యంలో భారతీయ మల్లయోధులు రాబోయే ప్రపంచ చాంపియన్‌ షిప్‌లలో భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం కోల్పోతారు.

ఫలితంగా ఏ దేశానికీ చెందని కోటాలో వారు పాల్గొనాల్సి ఉంటుంది. నిజానికి ఏప్రిల్‌ 28వ తేదీనే యునైటెడ్‌ వరల్డ్‌ ఆఫ్‌ రెజ్లింగ్‌ భారత బోర్డుకు హెచ్చరికలు జారీ చేసినా.. అడ్‌హాక్‌ కమిటీ పట్టించుకోలేదు. దీంతో ప్రపంచ సంస్థ నుంచి భారత ఫెడరేషన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది.