Priyadarshi | ప్రియ‌ద‌ర్శి ఒంటిపై గాయం.. కిడ్నీలు అమ్ముకున్నావా అంటూ నెటిజ‌న్స్ ట్వీట్స్

Priyadarshi: ప్రియ‌ద‌ర్శి అంటే అంద‌రికి బ‌లగం సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రంలో ప్రియ‌ద‌ర్శి పాత్ర‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. బ‌ల‌గం సినిమాతో ప్రియద‌ర్శికి స్టార్ స్టేట‌స్ కూడా పెరిగింది. అయితే ప్రియ‌ద‌ర్శి.. పెళ్లి చూపులు సినిమాతో లైమ్ లైట్ లోకి వ‌చ్చాడు. తెలంగాణ స్లాంగ్‌తో అద్భుత‌మై కామెడీ పండిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు ప్రియ‌ద‌ర్శి. ఇక మల్లేశం సినిమాలో త‌న న‌ట‌న‌ని పూర్తిగా బ‌య‌ట‌కు తీసి ఎంతో […]

  • Publish Date - August 4, 2023 / 02:11 AM IST

Priyadarshi: ప్రియ‌ద‌ర్శి అంటే అంద‌రికి బ‌లగం సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రంలో ప్రియ‌ద‌ర్శి పాత్ర‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. బ‌ల‌గం సినిమాతో ప్రియద‌ర్శికి స్టార్ స్టేట‌స్ కూడా పెరిగింది. అయితే ప్రియ‌ద‌ర్శి.. పెళ్లి చూపులు సినిమాతో లైమ్ లైట్ లోకి వ‌చ్చాడు. తెలంగాణ స్లాంగ్‌తో అద్భుత‌మై కామెడీ పండిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు ప్రియ‌ద‌ర్శి. ఇక మల్లేశం సినిమాలో త‌న న‌ట‌న‌ని పూర్తిగా బ‌య‌ట‌కు తీసి ఎంతో అలరించాడు. న‌వ్వించ‌డ‌మే కాదు ఏడ్పించ‌డంలోను త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్నాడు ప్రియ‌ద‌ర్శి.

త‌ర్వాత జాతిర‌త్నాలు సినిమాలో కూడా న‌టించి అలరించాడు. ఇక ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లైన‌ సేవ్ ది టైగర్స్ లో కూడా న‌టించి అందర్నీ కడుపుబ్బా నవ్వించేశాడు ప్రియ‌ద‌ర్శి. అయితే దిల్ రాజు బ్యాన‌ర్ లో బ‌ల‌గం సినిమాతో మంచి హిట్ కొట్టిన ప్రియ‌ద‌ర్శి ఆయ‌న బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఇదే కాక ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. ప్రియ‌ద‌ర్శి సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల ట్విట్టర్ సంభాషణ అప్పుడప్పుడు ట్విట్ట‌ర్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ప్రియ ద‌ర్శి త‌న సోష‌ల్ మీడియాలో అర్ధ‌న‌గ్నంగా ఓ పిక్ షేర్ చేసాడు. ఇందులో ఆయ‌న ఒంటి మీద ష‌ర్ట్ లేదు. ఓ గాయం క‌నిపిస్తుంది. ఇది చూసి చాలా మంది అభిమానులు కంగారు ప‌డుతున్నారు. మ‌రి కొంద‌రు అయితే కిడ్నీలు అమ్ముకున్నావా? బ్రో అంటూ కౌంటర్లు వేస్తున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఈ గాయం అయిందా, లేక గాయ‌మైన‌ట్టు అలా గీత గీసారా అంటూ ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రియ‌ద‌ర్శి ఒక్క పోస్ట్‌తో తెగ హాట్ టాపిక్‌గా మారాడు. ప్రియ‌ద‌ర్శి త‌న పోస్ట్‌లో త‌న‌కి అయిన గాయం నయం అవుతోందని చెప్ప‌డంతో అది నిజ‌మైన గాయ‌మ‌ని కొంద‌రు న‌మ్ముతున్నారు.

Latest News