Ajay Banga | ఎవరీ అజయ్ బంగా..?
Ajay Banga | వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన అజయ్ బంగా నియాకమైన సంగతి తెలిసిందే. అంతే కాదు.. ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్‌గా బంగా నిలిచారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీన వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఐదేండ్ల పాటు ఆయన కొనసాగనున్నారు. అజయ్ బంగా నేపథ్యం.. అజయ్ బంగా మహారాష్ట్రలోని పుణెలో 1959, నవంబర్ 10వ తేదీన జన్మించారు. […]
Ajay Banga |
వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన అజయ్ బంగా నియాకమైన సంగతి తెలిసిందే. అంతే కాదు.. ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్‌గా బంగా నిలిచారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీన వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఐదేండ్ల పాటు ఆయన కొనసాగనున్నారు.
అజయ్ బంగా నేపథ్యం..
అజయ్ బంగా మహారాష్ట్రలోని పుణెలో 1959, నవంబర్ 10వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి హర్బజన్ సింగ్ బంగా ఇండియన్ ఆర్మీలో పని చేశారు. లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్ట్స్ గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ ఎకనామిక్స్ పట్టా సాధించారు. ఎంబీఏకు సమానమైన పీజీపీ మేనేజ్‌మెంట్ కోర్సును అహ్మదాబాద్ ఐఐఎంలో చదివారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు అజయ్ బంగా. భారత ప్రభుత్వం 2016లో అజయ్‌ను పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.
అజయ్ బంగా ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక దశాబ్దానికి పైగా కంపెనీని విజయవంతంగా నిర్వహించిన అనంతరం 2021లో మాస్టర్ కార్డ్ నుండి తప్పుకున్నారు. మాస్టర్ కార్డు సీఈవోగా సంస్థ లాభాలను నాలుగు రెట్లు పెంచిన ఘనత సాధించారు. అమెరికాలోని ప్రముఖ భారతీయ అమెరికన్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా అజయ్ బంగా ఉన్నారు.
మాస్టర్‌కార్డ్‌లో చేరక ముందు, అజయ్ బంగా భారతదేశంలోని సిటీ గ్రూప్, నెస్లేలో దాదాపు పదేండ్ల పాటు సేవలందించారు. అనంతరం పెప్సికోలో 2 ఏండ్లు పనిచేశారు. పెప్సికో కు చెందిన అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీలను భారతదేశంలో ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు.
కాగా 189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. ఈ వరల్డ్ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో ఉన్న ఇండియన్స్ సేవలందిస్తున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అన్షులా కాంత్, చీఫ్ ఎకానమిస్ట్‌గా ఇందర్‌మిత్ గిల్, చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా లక్ష్మీ శ్యామ్ సుందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పరమేశ్వరన్ అయ్యర్ కొనసాగుతున్నారు.
World Bank | ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా ఎన్నిక
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram