టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఎవరు..?

తెలంగాణలో నూతనంగా ఏర్పడనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఎవరు నియామితులవుతారన్నదానిపై సోషల్‌ మీడియాలో చర్చ జోరందుకుంది

  • By: Somu    latest    Dec 04, 2023 10:51 AM IST
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఎవరు..?

విధాత : తెలంగాణలో నూతనంగా ఏర్పడనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఎవరు నియామితులవుతారన్నదానిపై సోషల్‌ మీడియాలో చర్చ జోరందుకుంది. కాంగ్రెస్‌ అధికారంలో రావడానికి నిరుద్యోగ యువత, విద్యార్థుల మద్దతు ఎన్నికల్లో కీలక భూమిక పోషించింది. ఫలితాల అనంతరం పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సైతం 31లక్షల మంది నిరుద్యోగుల శ్రమతోనే పార్టీ గెలిచిందంటూ వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్‌ ఎన్నికల హామీల్లో జాబ్‌ క్యాలెండర్‌, 2లక్షల ఖాళీ ఉద్యోగాల భర్తీ కీలకంగా ఉన్న నేపధ్యంలో ఇందుకు టీఎస్‌పీఎస్సీలో సమర్ధుడైన వ్యక్తి కోసం ఆ పార్టీ అన్వేషించక తప్పదు. బీఆరెస్‌ ప్రభుత్వంలో పేపర్ల లీకేజీ, పరీక్షల రద్దుతో అస్తవ్యస్తమైన టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన అత్యవసరంగా చేయాల్సివుంది.


టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ కోడండరామ్‌ పేరుతో ప్రస్తుతం సోషల్‌ మీడియా చర్చలో నానుతుంది. అయితే ఆయన ఆ పోస్టు తీసుకునేందుకు ఒప్పుకుంటారో లేదో తెలియదు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోదండరామ్‌కు కీలక పదవి ఇవ్వనుందని తెలుస్తుంది. అది టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ లేక మరొకటా అన్నది చర్చనీయాంశమైంది.