Soft Drinks | కూల్‌డ్రింకుల్లో ఉన్న యాస్పర్‌టేమ్ వల్ల క్యాన్సర్ వస్తుందా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది?
Soft Drinks విధాత: మనం తాగే శీతలపానీయాలు (Cool Drinks), తినే ఐస్‌క్రీములు, బేకరీ పదార్థాల్లో ఉండే యాస్పర్‌టేమ్ అనే తీపి పదార్థం కేన్సర్ (Cancer) ను కలిగించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించిన విషయం విదితమే. అసలు ఈ యాస్పర్‌టేమ్ (Aspartame) అంటే ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలను పరిశీలిస్తే.. పదార్థాలకు తీపినివ్వడం కోసం పంచదార బదులు ఈ యాస్పర్‌టేమ్ అనే కృత్రిమ స్వీట్‌నర్ (Artificial Sweetener) ను ఉపయోగిస్తారు. 1980 నుంచి […]
Soft Drinks
విధాత: మనం తాగే శీతలపానీయాలు (Cool Drinks), తినే ఐస్‌క్రీములు, బేకరీ పదార్థాల్లో ఉండే యాస్పర్‌టేమ్ అనే తీపి పదార్థం కేన్సర్ (Cancer) ను కలిగించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించిన విషయం విదితమే. అసలు ఈ యాస్పర్‌టేమ్ (Aspartame) అంటే ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలను పరిశీలిస్తే.. పదార్థాలకు తీపినివ్వడం కోసం పంచదార బదులు ఈ యాస్పర్‌టేమ్ అనే కృత్రిమ స్వీట్‌నర్ (Artificial Sweetener) ను ఉపయోగిస్తారు. 1980 నుంచి దీని వాడకం మొదలైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇది పంచదార (Sugar) కన్నా తీపిగా ఉండటంతో.. కొద్ది మొత్తంలో ఆహారంలో లేదా డ్రింక్‌లో కలిపితే సరిపోతుంది. అందుకే దీనిని ఆయా సంస్థలు విరివిగా ఉపయోగిస్తాయి.

అయితే దీనిని ఎక్కువగా చల్లగా ఉండే పదార్థాలు, వేడి చేయడం అవసరం లేని తినుబండారాల్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే పదార్థాన్ని వేడిచేస్తే అందులో ఉండే యాస్పర్‌టేమ్ తీపిదనాన్ని కోల్పోతుంది. ప్రస్తుతం ఈ స్వీట్‌నర్‌ను మనం రోజూ ఉపయోగిస్తున్న శీతలపానీయాలు (Cool Drinks), డైట్ కోక్‌లు, జెలటిన్, ఐస్‌క్రీమ్, యోగర్ట్ తదితర డయరీ ఉత్పత్తులు, తీపిగా ఉండే దగ్గు సిరప్‌లు, చూయింగ్ గమ్‌లు, టూత్‌పేస్టులు మొదలైన వాటిలో కలుపుతున్నారు. లో క్యాలరీ, షుగర్ ఫ్రీ ఆహారం కోసం చూసే వారు ఈ యాస్పర్‌టేమ్‌ను స్వీట్‌నర్‌గా తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. డైట్, జీరో షుగర్, నో క్యాలరీ, లో క్యాలరీ అంటూ నిబంధనలు పాటించేవారు దీనిని కావాలని ఉపయోగిస్తున్నారు.

డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది?
యాస్పర్‌టేమ్ క్యాన్సర్‌ను కలిగించొచ్చని డబ్ల్యహెచ్ఓ (WHO)చెప్పినప్పటికీ.. ఇది చాలా ప్రాథమిక స్థాయిలో జరిగిన అధ్యయనం. దీనికి చాలా తక్కువ ఆధారాలే ఆ సంస్థకు లభించాయి. కచ్చితంగా క్యాన్సర్‌కు దారి తీయొచ్చు అని చెప్పడానికి ఇంకా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. డబ్ల్యూహెచ్ఓ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌సీ), ఫుడ్ అండ్ అగ్రకల్చర్ ఆర్గనైజేషన్, జాయింట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ అడిటివ్స్ (జేఈసీఎఫ్ ఏ) తదితర సంస్థలు యాస్పర్‌టిమ్ వాడకానికి, క్యాన్సర్‌కు ఉన్న సంబంధంపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram