OMG-2 | ‘ఓ మై గాడ్ 2’కి అదే శాపమైందా? అందుకే కలెక్షన్స్ రావడం లేదా?
OMG-2 | మన దేశంలో మతం పరంగా, మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏ సినిమా వచ్చినా అది వివాదాల్లోకి వెళ్ళక తప్పదు. ఇదే జరుగుతోంది ఇటీవలే బాలీవుడ్‌లో వచ్చిన అక్షయ్ కుమార్ నటించిన OMG-2 మూవీతో. శివుడి దూత లాగా పాత్రని పోషించిన అక్షయ్ కుమార్ ఇంతకుముందే OMG మూవీని తీశారు. దానికి సీక్వెల్ గానే ఈ సినిమా రాగా ఇందులో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండడం వల్ల సోషల్ మీడియాలో ఎక్కడ […]

OMG-2 |
మన దేశంలో మతం పరంగా, మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏ సినిమా వచ్చినా అది వివాదాల్లోకి వెళ్ళక తప్పదు. ఇదే జరుగుతోంది ఇటీవలే బాలీవుడ్‌లో వచ్చిన అక్షయ్ కుమార్ నటించిన OMG-2 మూవీతో. శివుడి దూత లాగా పాత్రని పోషించిన అక్షయ్ కుమార్ ఇంతకుముందే OMG మూవీని తీశారు.
దానికి సీక్వెల్ గానే ఈ సినిమా రాగా ఇందులో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండడం వల్ల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ పాత్ర కచోడీలను అమ్ముతుంటాడు. శివుడి దూత పాత్ర అయిన తను మురికి కాలువలో స్నానం చేసే సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ అది దేవుడి ప్రతిష్టని పూర్తిగా దిగజారే విధంగా చిత్రీకరించారని అందరూ ఆరోపిస్తున్నారు.
ఇంతే కాకుండా అక్షయ్ కుమార్‌ని చెంప దెబ్బ కొట్టినా, అతని పై ఉమ్మి వేసినా అలా చేసినవారికి రూ.10 లక్షల రివార్డుని అందజేస్తామని ఏకంగా ఆగ్రాలో ఓ హిందూ సంస్థ ప్రకటించింది. రాష్ట్రీయ హిందూ పరిషత్ భారత్ ఇటీవల నటుడి దిష్టిబొమ్మలను, సినిమా పోస్టర్లను కాళ్ళకింద తొక్కుతూ, దహనం చేసింది.
థియేటర్ల ముందు నిరసన ప్రకటిస్తూ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అయిన గోవింద్ పరాశర్ హిందువు మనోభావాలని ఈ సినిమా పూర్తిగా దెబ్బతీసింది అని మాట్లాడారు. సెన్సార్ బోర్డ్, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చిత్రాన్ని నిషేధించాలని, అలా జరగకపోతే ఇంకా ఉదృతంగా నిరసనల్ని అమలుచేస్తామని హెచ్చరించినా.. ఎలాగోలా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయినా కూడా వివాదం ఆగలేదు.
ఆలయ ప్రాంగణంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను ‘అశ్లీలమైనవి’గా పేర్కొంటూ వాటిని తొలగించాలని ఉజ్జయిని మహాకాళ్ ఆలయ పూజారులు డిమాండ్ చేశారు. కథలో పాత్ర ఉజ్జయినిలో నివసించే శివభక్తుడైన కాంతి శరణ్ ముద్గల్ (పంకజ్ త్రిపాఠి) చుట్టూ అల్లబడింది. అతని విశ్వాసం పరీక్షించబడినప్పుడు కాంతికి సహాయం చేయడానికి ప్రభువు దూతగా అక్షయ్ కుమార్ మారువేషాలలో వస్తాడు. ఇందులోని కొన్ని అభ్యంతకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంత వేడి మీద సినిమా ఉండగా దేశ నలుమూలలా హిందూ మనోభావాలకు భంగం వాటిల్లిన వారందరూ వారి పరిధుల్లో సనాతన ధర్మం కోసం నిరసనల్ని అభ్యర్థిస్తున్నారు. అందుకే టాక్ బాగా వచ్చినా.. ఈ సినిమాకు అనుకున్నంతగా కలెక్షన్స్ లేవని తెలుస్తోంది. మరో వైపు ‘గదర్2’ చిత్రం పాజిటివ్ టాక్‌తో బీభత్సంగా కలెక్షన్స్‌ను కొల్లగొడుతోంది.