తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకింత వివక్షా..? పెండింగ్ లో ఉన్న 14 జాతీయ రహదారుల సంగతేంటి..?: బోయినపల్లి

కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వడం లేదు..? రాష్ట్ర పర్యటనలో ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రధానిని డిమాండ్ చేసిన వినోద్ కుమార్ విధాత: ఐదారేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన 14 జాతీయ రహదారుల మంజూరుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైఎస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్‌ చేశారు. సూత్ర ప్రాయంగా అంగీకరించిన ఈ రహదారులను ఎందుకు మంజూరు చేయడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ […]

  • By: krs    latest    Apr 07, 2023 2:01 PM IST
తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకింత వివక్షా..? పెండింగ్ లో ఉన్న 14 జాతీయ రహదారుల సంగతేంటి..?: బోయినపల్లి

కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వడం లేదు..?
రాష్ట్ర పర్యటనలో ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రధానిని డిమాండ్ చేసిన వినోద్ కుమార్

విధాత: ఐదారేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన 14 జాతీయ రహదారుల మంజూరుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైఎస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్‌ చేశారు. సూత్ర ప్రాయంగా అంగీకరించిన ఈ రహదారులను ఎందుకు మంజూరు చేయడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు.

ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులు, కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరు విషయంలో తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం తీవ్ర వివక్షత చూపుతుందన్నారు.

రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన జాతీయ రహదారులను మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. ఫలితంగా 1656 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి మంజూరు పనులు కేంద్ర ప్రభుత్వం వద్ద సుధీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని ఆయన వివరించారు.

పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల ప్రతిపాదనలుఇవే….

చౌటుప్పల్ (ఎన్ హెచ్ 65) – ఆమంగల్ – షాద్ నగర్ – సంగారెడ్డి మధ్య 182 కిలో మీటర్ల జాతీయ రహదారిని, కరీంనగర్ ( ఎన్.హెచ్. 563 జంక్షన్ ) – సిరిసిల్ల – కామారెడ్డి – ఎల్లారెడ్డి – పిట్లం ( ఎన్.హెచ్. 161 జంక్షన్ ) మధ్య 165 కిలో మీటర్లు, వనపర్తి – కొత్తకోట – గద్వాల్ – మంత్రాలయం ( ఎన్.హెచ్. 167 మధ్య 110 కిలో మీటర్లు, ఎర్రవల్లి చౌరస్తా – గద్వాల్ – రాయచూర్ మధ్య 67 కిలో మీటర్లు, మన్నేగూడ – వికారాబాద్ – తాండూర్ – జహీరాబాద్ – బీదర్ మధ్య 133 కిలో మీటర్లు, మరికల్ – నారాయణ్ పేట – రామ సముద్రం మధ్య 63 కిలో మీటర్లు, జగిత్యాల – పెద్దపల్లి – కాల్వ శ్రీరాంపూర్ – కిష్టంపేట – రామప్ప టెంపుల్ – జంగాలపల్లి మధ్య 164 కిలోమీటర్లు, సారపాక – ఏటూరునాగారం మధ్య 93 కిలోమీటర్లు, పుల్లూరు – అల్లంపూర్ – జెట్ ఫ్లోర్ – పెంట్లవెల్లి – కొల్లాపూర్ – లింగాల్ – అచ్చంపేట – దిండి – దేవరకొండ – మల్లేపల్లి – నల్గొండ మధ్య 225 కిలోమీటర్లు, దుద్దెడ -కొమురవెల్లి -యాదగిరిగుట్ట – రాయగిరి క్రాస్ రోడ్ మధ్య 63 కిలోమీటర్లు, జగ్గయ్యపేట – వైరా – కొత్తగూడెం మధ్య 100 కిలోమీటర్లు, సిరిసిల్ల – వేములవాడ – కోరుట్ల మధ్య 65 కిలోమీటర్లు, భూత్పూర్- నాగర్ కర్నూల్- మన్ననూరు మద్దిమడుగు- గంగలకుంట -సిరిగిరిపాడు మధ్య 165 కిలోమీటర్లు, కరీంనగర్- రాయపట్నం మధ్య 60 కిలోమీటర్లు.

జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు మంజూరు చేయరా..?

జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే ఉన్నాయనన్నారు. జిల్లాల పునర్విభన ద్వారా 10 జిల్లాలున్న తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. ఇందులో కొత్తగా ఏర్పడిన 24 జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు అత్యంత ఆవశ్యక అవశ్యకత ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడి తెలంగాణ రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయం విద్యాలయాలను మంజూరు చేయాలన్నారు. ప్రధాని హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వే లైన్లు ఇవ్వాలని, కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.