Kajal Agarwal: అయ్యో.. కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌ని ఇలా అనేసిందేంటి?
Kajal Agarwal, Bollywood విధాత: ‘RRR’ సినిమాతో పాటు ‘KGF’, ‘కాంతార’, ‘పుష్ప’ వంటి సినిమాలు సౌత్ సినిమా స్టామినాని దేశ వ్యాప్తంగా చాటాయి. ఇంకా చెప్పాలంటే గ్లోబల్ స్థాయికి సౌత్ సినిమా చేరేలా చేశాయి. అయితే కొన్నాళ్లుగా బాలీవుడ్ మాత్రం దారుణంగా పడిపోతుంది. రీసెంట్‌గా వచ్చిన ‘పఠాన్’ కాస్త పరువు నిలబెట్టినా.. ఆ తర్వాత సరైన సినిమా బాలీవుడ్‌లో రానే లేదు.. వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇదిలా ఉంటే.. […]

Kajal Agarwal, Bollywood
విధాత: ‘RRR’ సినిమాతో పాటు ‘KGF’, ‘కాంతార’, ‘పుష్ప’ వంటి సినిమాలు సౌత్ సినిమా స్టామినాని దేశ వ్యాప్తంగా చాటాయి. ఇంకా చెప్పాలంటే గ్లోబల్ స్థాయికి సౌత్ సినిమా చేరేలా చేశాయి. అయితే కొన్నాళ్లుగా బాలీవుడ్ మాత్రం దారుణంగా పడిపోతుంది. రీసెంట్‌గా వచ్చిన ‘పఠాన్’ కాస్త పరువు నిలబెట్టినా.. ఆ తర్వాత సరైన సినిమా బాలీవుడ్‌లో రానే లేదు.. వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ బాలీవుడ్‌ని మరింతగా దిగజార్చుతున్నాయి.
వాస్తవానికి ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తున్న హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరూ బాలీవుడ్‌లో తమకంటూ మంచి క్రేజ్ సంపాదించుకోవాలని తపన పడుతుంటారు. అలా కాస్త క్రేజ్ వచ్చిన తరువాత తిరిగి ఇండస్ట్రీ మీద చీప్ కామెంట్స్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ఇది టాలీవుడ్‌లో కూడా జరుగుతుండేదే.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిన హీరోయిన్లు ఎందరో.. తర్వాత టాలీవుడ్‌ని చిన్నచూపు చూస్తూ కామెంట్స్ చేశారు. కాకపోతే.. ఇప్పుడు రివర్స్‌లో ఉంది వ్యవహారం. కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ చూస్తే.. ఇకపై ఎవరూ బాలీవుడ్ వైపు అడుగులు వేయాలని కూడా ఆలోచించరు. అసలింతకీ కాజల్ ఏమందంటే..
తాజాగా కాజల్ అగర్వాల్ రైజింగ్ ఇండియా అనే పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా.. టాలీవుడ్‌కి, బాలీవుడ్‌కి మధ్య గల తేడా గురించి ఎంతో వివరంగా చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో మంచి క్రమశిక్షణతో కూడిన విలువలు ఉంటాయని, బాలీవుడ్‌లో వీటికి అంత ప్రాధాన్యం ఉండదని చెప్పుకొచ్చింది. ఆమె ఇలా చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె మాటలు విన్న సౌత్ సినీ ఇండస్ట్రీ అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటే.. బాలీవుడ్ వాళ్లు మాత్రం కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఇక కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే.. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమై, ఎన్నో మంచి సినిమాలలో, ఎందరో స్టార్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2020లో పెళ్లి చేసుకుని, ఒక బాబుకి జన్మనిచ్చిన తరువాత.. ఇప్పుడు బాలయ్య NBK108 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు ఆమె సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వాటి వివరాలు బయటికి రానున్నాయి.