Niharika-Chaitanya Divorce | నిహారిక-చైతన్య విడాకులు ఖాయమేనా..! నాగబాబు మౌనం అందుకేనా?

Niharika-Chaitanya Divorce | పెళ్లి జీవితంలో మధురమైన ఘట్టం. భార్యభర్తల ఉన్న ప్రేమ, అన్యోన్యత, ఒకరినొకరు అర్థం చేసుకుని మెదలడంపైనే ఆ బంధం ఆధారపడి ఉంటుంది. ఏదైనా మనస్పర్థలు వస్తే చిలికి చిలికి గాలివానలా మారి చివరకు ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంటుంది. ఇది సామాన్య జనం కంటే సెలబ్రెటీల విషయంలో ఎక్కువగా వర్తిస్తూ ఉంటుంది. సెలబ్రెటీల పెళ్లిళ్లు, విడాకలు సర్వసాధారణమే. ముఖ్యంగా సినిమా తారల విషయంలో మరీ ఎక్కువ. ఇటీవల మెగా ఫ్యామిలీలో మరో విడాకులు […]

  • By: Vineela |    latest |    Published on : Mar 21, 2023 2:17 PM IST
Niharika-Chaitanya Divorce | నిహారిక-చైతన్య విడాకులు ఖాయమేనా..! నాగబాబు మౌనం అందుకేనా?

Niharika-Chaitanya Divorce | పెళ్లి జీవితంలో మధురమైన ఘట్టం. భార్యభర్తల ఉన్న ప్రేమ, అన్యోన్యత, ఒకరినొకరు అర్థం చేసుకుని మెదలడంపైనే ఆ బంధం ఆధారపడి ఉంటుంది. ఏదైనా మనస్పర్థలు వస్తే చిలికి చిలికి గాలివానలా మారి చివరకు ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంటుంది. ఇది సామాన్య జనం కంటే సెలబ్రెటీల విషయంలో ఎక్కువగా వర్తిస్తూ ఉంటుంది. సెలబ్రెటీల పెళ్లిళ్లు, విడాకలు సర్వసాధారణమే. ముఖ్యంగా సినిమా తారల విషయంలో మరీ ఎక్కువ.

ఇటీవల మెగా ఫ్యామిలీలో మరో విడాకులు జరుగుబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. నటుడు నాగబాబు తనయ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోనుందని ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు అటు నిహారిక, మరో వైపు చైతన్య సైతం ఖండించలేదు. అలాగే మెగా ఫ్యామిలీ కానీ, నిహారిక తండ్రి నాగబాబు సైతం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇటీవల నిహారిక భర్త చైన్య సోషల్‌ మీడియా ఖాతాను అన్‌ఫాలో చేయడం, ఫొటోలను డిలీట్‌ చేయడంతో ఇద్దరు విడాకులు తీసుకోవడం ఖాయమంటున్నారు.

అదే సమయంలో అలాంటిదేమీ లేదని పలువురు పేర్కొంటున్నారు. అదే సమయంలో పలు విషయాలపై స్పందించే నాగబాబు.. కూతురు విషయంలో వస్తున్నలపై ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శిస్తున్నారు. మెగా ఫ్యామిలీ విషయంతో పాటు టాలీవుడ్‌, రాజకీయాలపై స్పందించే నాగబాబు.. నిహారిక విషయంలో స్పందించకపోవడంతో విడాకులు నిజమేనని క్లారిటీ ఇచ్చినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. ఇకనైనా మరి నాగబాబు స్పందిస్తాడా? లేదా చూడాలి మరి..!