Niharika and Chaitanya విధాత: మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డల వివాహం ఆ మధ్య అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. మరి ఏం జరిగిందో ఏమో.. సడన్ గా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అసలు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు సడన్ గా విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏమిటా అని అంతా ఇప్పుడు బుర్రలకి పదును పెడుతున్నారు. వివాహానికి ముందు నిహారిక.. పెళ్ళైయిన తరువాత మూవీస్ కానీ, […]
Niharika and Chaitanya
విధాత: మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డల వివాహం ఆ మధ్య అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. మరి ఏం జరిగిందో ఏమో.. సడన్ గా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అసలు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు సడన్ గా విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏమిటా అని అంతా ఇప్పుడు బుర్రలకి పదును పెడుతున్నారు.
వివాహానికి ముందు నిహారిక.. పెళ్ళైయిన తరువాత మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ.. అసలు యాక్టింగ్ జోలికి వెళ్ళనని అత్తింటి వాళ్ళకి మాటిచ్చిన నిహారిక.. నిర్మాతగా కొనసాగుతానని చెప్పింది. తాను చెప్పినట్లు కొన్నాళ్ళు ఆ మాట మీదే నిలబడి నిర్మాణ బాధ్యతలు మాత్రమే చూసుకుంది. ఇక్కడే బండి ట్రాక్ తప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ మధ్య విడాకులు అని వార్తలొచ్చిన కొన్ని రోజులకే వెబ్ సీరీస్లలో నటించడం మొదలెట్టింది. ఎప్పుడైతే నటన మొదలెట్టిందో అప్పుడే వారిద్దరి మధ్య చెడిందనేలా వార్తలు వచ్చేశాయ్. ఎందుకంటే ఆ మధ్య ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని చెప్పి పబ్ లో జరిగిన రైడ్‌లో దొరికిపోయి ఒక రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు కూడా చైతన్య మరియు అతని ఫ్యామిలీ తనకి అండగా నిలబడి సపోర్ట్ చేశారు. మరి ఆ సంఘటన తరువాత కూడా వారిద్దరూ అన్యోన్యంగానే కనిపించారు. మరి ఎక్కడ చెడిందో కానీ ఇద్దరు విడిపోవడానికి నిశ్చయించుకున్నారు.
ఇంతకీ వీరి విడాకులకు కారణం నిహారిక మళ్లీ నటనలోకి దిగడమేనా.., లేక మరేదైనా కారణం ఉందా? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది.. ఎందుకు ఇంత సడన్ గా విడిపోయారు అనేది మిస్టరీగానే ఉండి పోతుంది. ఎందుకంటే దీనిపై ఎవరూ క్లారిటీ ఇచ్చే సాహసం చేయరు కనక. మెగా ఫ్యామిలిలో శ్రీజ ఇచ్చిన షాక్ ల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఫ్యామిలీకి, నిహారిక రూపంలో మరో షాక్ తగిలింది. మెగా ఫ్యామిలీ డాటర్స్‌కి పెళ్లిళ్లు కలిసి రావడం లేదా, వేరే ఏదైనా లోపాలున్నాయా.. అనే ఆలోచనల్లో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన మూడో భార్యతో విడాకులు తీసుకుంటున్నాడనే విషయం అభిమానుల్ని మరింత షాక్ కి గురి చేసింది. ఈ విషయమై జనసేన పార్టీ నుంచి క్లారిటీ వచ్చినా.. ఆ క్లారిటీలో సరైన క్లారిటీ లేదనేలా కూడా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక నిహారిక విషయానికి వస్తే.. ఆమె విడాకులకు కారణం.. ఆమె నిర్మాతగా వ్యవహరించడమే అని తెలుస్తుంది.
స్టోరీ డిస్కషన్స్ అని చెప్పి.. తనకు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తికి నిహారిక బాగా క్లోజ్‌గా మూవ్ అవుతుండటం చూసి.. చైతన్య చాలా బాధపడ్డానని, ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లుగా ప్రస్తుతానికైతే టాక్ వినబడుతుంది. మరో విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తిని నిహారిక రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే నిహారిక రెండో పెళ్లి అంటూ అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు కమ్మేస్తున్నాయి.